Walking : కడుపునిండా తిని వాకింగ్ చేస్తున్నారా!

ఉదయాన్నే ఏమీ తినకుండా నడవాల్సిన పనిలేదు. నడకకు ముందు తేలికపాటి బ్రెడ్, పాలు వంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఏమి తినకుండా నడవటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయి. ఏదో ఒకటి తిని నడవటం వల్ల ఆభయం ఉండదు.

Walking : కడుపునిండా తిని వాకింగ్ చేస్తున్నారా!

Walking

Walking : వాకింగ్​ చేసే విషయంలో చాలా మందిలో అనేక సందేహలు ఉంటాయి. ఉదయాన్నే నడవాలా, సాయంత్రం నడవాలా, తినక ముందు నడవాల, తిన్న తరువాత నడవాలా ఇలా అనేక సందేహాలు కలుగుతుంటాయి. అయితే వాకింగ్ చేసే విషయంలో నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. సాధారణంగా ఉదయం పూట నడవటం మంచిదని, ఎందుకంటే ఉదయం వేళ కాలుష్యం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో నడవటం వల్ల చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుంది.

ఉదయాన్నే ఏమీ తినకుండా నడవాల్సిన పనిలేదు. నడకకు ముందు తేలికపాటి బ్రెడ్, పాలు వంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఏమి తినకుండా నడవటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయి. ఏదో ఒకటి తిని నడవటం వల్ల ఆభయం ఉండదు. అలాగని కడుపు నిండా తిని నడవటం ఎవరికీ మంచిది కాదు. భోజనం చేసినప్పుడు జీర్ణకోశ వ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరగాలి. కడుపు నిండా తిని వడివడిగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీని వల్ల సమస్యలు ఎదురవుతాయి. సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయవచ్చు. ఉదయంపూట నడకకు సమయంలేని వారు సాయంత్రపూట వాకింగ్ చేయవచ్చు. అయితే ఉదయం పని బిజీలో గడి సాయంత్రం వాకింగ్ చేసేందుకు శరీరం ఏమాత్రం సహకరించదు. కాబట్టి వాకింగ్ కు ఉదయం షెడ్యూల్ కేటాయించటం మంచిది.

రాత్రి సమయంలో కూడా వాకింగ్ చేయెచ్చు. కాకపోతే చీకటిలో నడవటం వల్ల అనుకోకుండా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు తలెత్తొచ్చు. ఆరుబయటే నడవాలని లేదు. ఇంట్లోనూ నడవొచ్చు. గదులలో కాకుండా పొడవాటి వరండాలో, పెరటిదొడ్డిలో ,డాబా మీద నడవొచ్చు. రోజుకు 10వేల అడుగులు నడవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.