Nails : మీరు ఆరోగ్య వంతులో.. కాదో…గోళ్ళు చూసి చెప్పొచ్చా?

సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్‌ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది.

Nails : మీరు ఆరోగ్య వంతులో.. కాదో…గోళ్ళు చూసి చెప్పొచ్చా?

Nails2

Nails : మన చేతికోళ్ళు మనకున్న వ్యాధులను చెప్పగలవా…అవును ఇది నిజమే… వ్యాధులను నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నిసార్లు గోర్లు చూసి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే చెప్పేయ్య వచ్చు. గోళ్ళ ఆరోగ్యం మనుషుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు.. గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా జబ్బు పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. అయితే గోళ్ళ పై తెల్ల మచ్చలు ఉంటే కొన్నిరకాల అనారోగ్య సమస్యలకు దారి తీసేందుకు సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు.

పాలిపోయి ఉంటే.. తెల్లగా తళతళలాడిపోయే గోళ్లు నిజానికి ఏమంత మంచివి కావు. శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనను ఇవి అందిస్తాయి. శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికనూ ఇవి చేస్తాయి. ఇక గుండె లేదా లివర్‌ పనితీరులో ఏదన్నా లోపం ఉన్నప్పుడు కూడా గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. గోళ్ళ పై తెల్ల మచ్చలు ఉంటే కొన్ని సీరియస్ డిసీజ్ లకు ఇది లక్షణాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మచ్చలు లివర్ , హైపటైటిస్ వ్యాధులకు దారితీస్తుంది. ఇంకా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఈ సూచనలు వస్తాయి. గోళ్ళ పై తెల్ల మచ్చలు, గోర్లు నిర్జీవంగా మారినట్లు కనిపిస్తే ఐరన్ లోపం ఉందని తెలుసుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా పాలు, పాల పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, గుడ్లు కూడా ఎక్కువగా తినాలి.

కొంత మందికి నెయిల్ పాలిష్ వేసుకుంటే సరిపడదు. వారికి ఇలా తెల్ల మచ్చలు వస్తాయి. క్యాల్షియం , జింక్ లోపం ఉన్నా కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. అందువలన క్యాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారికి, నోటి దుర్వాసన, కిడ్నీ ఫెయిల్యూర్, సోరియాసిస్, ఎగ్జిమ, న్యూమోనియా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మచ్చలు వస్తాయి. ఆర్సెనిక్ ఫుడ్ పాయిజనింగ్ అయినా ఇలా గోళ్లపై తెల్ల మచ్చలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవటమే మేలు.

సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్‌ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది. పొగతాగేవారిలో, నెయిల్‌ పాలిష్‌ను ఎడాపెడా వాడేవారిలో కూడా గోళ్లు ఇలా పసుపురంగులోకి మారిపోతుంటాయి. గోళ్లు పొడిబారిపోయి, పొరలుపొరలుగా విడిపోతూ, తేలికగా విరిగిపోతాయి. వయసు మీరకుండానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం జాగ్రత్త అవసరం. తరచూ నీటిలో నానడం, ఘాటైన రసాయనాలలో చేతులు పెట్టేయడం, నెయిల్ పాలిష్‌ రిమూవర్‌ను వాడటం దీనికి కారణం కావచ్చు. అటు నీళ్లు, ఇటు బట్టల సబ్బులతో ఎక్కువసేపు గడిపే ఆడవారిలో ఇలాంటి గోళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఒక్కోసారి విటమిన్ల లోపం కూడా కారణం కావచ్చు.

గోళ్ల మీద నిలువు గీతలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపిస్తే కంగారు పడాల్సిన పనిలేదు. ‘బి’ విటమిన్‌ లోపించడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అడ్డగీతలు కనిపిస్తే మాత్రం వైద్యుని సంప్రదించడం మంచిది. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నప్పుడు, గోళ్లలో అడ్డగీతలు ఏర్పడుతూ ఉంటాయి. గోళ్లు పెరుగుదల కూడా ఆగిపోయేంతగా శరీరంలో ఏదో లోపం ఏర్పడినట్లు గ్రహించాలి.