Dry Skin : వాతావరణంలో మార్పులతో చర్మం పొడిబారటం వంటి సమస్యలు చవిచూడాల్సి వస్తుందా? ఇలా చేసి చూడండి!

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. ఉదయం, సాయంత్రం నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకుంటే దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల జిడ్డుతో పాటు ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలు తొలగిపోతాయి.

Dry Skin : వాతావరణంలో మార్పులతో  చర్మం పొడిబారటం వంటి సమస్యలు చవిచూడాల్సి వస్తుందా? ఇలా చేసి చూడండి!

Are you suffering from dry skin due to climate change_ Try this!

Dry Skin : సీజన్ మారితే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధు చుట్టుముట్టటంతోపాటు చర్మం పొడి బారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో స్కిన్ పాడవుతుంది. జిడ్డు చర్మం కలిగినవారికి స్కిన్ మరింత ఆయిలీగా మారుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తాయి. చర్మం దురద పెట్టడం, పగలడం, ఇతర ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ పరిస్ధితి నుండి చర్మం, ముఖాలను రక్షించుకోవాలంటే కొన్ని చిట్కాలు తప్పక పాటించాలి.

1. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది. ఉదయం, సాయంత్రం నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకుంటే దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల జిడ్డుతో పాటు ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలు తొలగిపోతాయి.

2. గాఢత ఉన్న ఫేస్ క్రీములు వాడకపోవడం మంచిది. దీనికి బదులుగా ఫ్రెష్ టోనింగ్ రోజ్ వాటర్ వాడవచ్చు. వర్షాకాలంలో వచ్చే చర్మ సంబంధ సమస్యలకు రోజ్ వాటర్ చెక్ పెడుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది.

3. చర్మాన్ని రోజంతా మాయిశ్చరైజింగ్‌గా ఉంచడం చాలా అవసరం. చర్మం సహజసిద్ధంగా మాయిశ్చరైజ్ కావాలంటే శరీరంలో తేమ శాతం అధికంగా ఉండాలి. మంచి నీటిని ఎక్కువగా తాగితే చర్మం మాయిశ్చరైజ్ గా తయారై ప్రకాశవంతంగా ఉంటుంది.

4. శనగ పిండి కూడా జిడ్డును తొలగించడంలో సాయం చేస్తుంది. శనగ పిండితో ప్రతిరోజూ స్నానం చేసినా చర్మం తాజాగా ఉంటుంది. దీంతో పాటు మీ చర్మతత్వానికి తగినట్లుగా మాయిశ్చరైజర్‌ను ఎంపిక చేసుకోండి. దీనిని రెగ్యులర్‌గా అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

5. ప్రతిరోజు కనీసం రెండు సార్లు అయినా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సాధారణ సబ్బుతో కాకుండా ఫేష్‌వాష్‌తో శుభ్రం చేసుకోవటం మంచిది. ఉదయం లేవగానే, రాత్రి పడుకోబోయే ముందు ఫేష్‌వాష్‌ చేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

6. చర్మాన్ని రక్షించేందుకు ఫేస్ ప్యాక్స్ బాగా ఉపయోగపడతాయి. అరటి పండ్లు, బొప్పాయి, పుచ్చకాయ వంటి వాటిని మొత్తగా చేసి ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనె, పసుపు, శనగపిండి కలిపిన ఫేస్ ప్యాక్ కూడా ముఖం తాజాగా ఉండేలా చేస్తుంది.

వీటితో పాటుగా చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది. గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి చర్మంలో ఉండే మృత కణాలను తొలగించడంలో సహాయపడతాయి.