Leg Cramps : కాలి పిక్కలు పట్టేస్తున్నాయా! అర్ధరాత్రి నిద్రకు భంగం కలిగించే ఈ సమస్య నుండి బయటపడాలంటే!

కండ‌రాలు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ నొప్పి  10 నిమిషాల వ‌ర‌కు ఉంటుంది. అనంతరం దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. కొంద‌రికి ఈ స‌మ‌స్య ఎప్పుడో ఒక‌సారి వ‌స్తుంది. కానీ కొంద‌రికి రోజూ రాత్రి సమయంలో ప‌గ‌లు కూడా ఇలా అవుతుంటుంది.

Leg Cramps : కాలి పిక్కలు పట్టేస్తున్నాయా! అర్ధరాత్రి నిద్రకు భంగం కలిగించే ఈ సమస్య నుండి బయటపడాలంటే!

Leg Cramps

Leg Cramps : సాధారణంగా చాలా మందికి నిద్రలో కాలిపిక్కలు పట్టేస్తుంటాయి. గాఢంగా నిద్రిస్తున్నప్పుడు హఠాత్తుగా ఇలా జరుగుతుంది. ఆ సమయంలో పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అంతేకాకుండా నిద్రకు భంగం కలుగుతుంది. విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ స‌మ‌స్య‌ను వైద్య పరిభాషలో నాక్చర్నల్ లెగ్ క్రాంప్స్ అని అంటారు. కండ‌రాలు పట్టేసిన‌ప్పుడు అవి ముడుచుకుపోయి ఉంటాయి. దీంతో పాదాలు కొన్ని సార్లు వంక‌ర పోయిన‌ట్లు అవుతాయి. ఒక్కోసారి కాలి వేళ్ల‌కూ ఇలా జ‌రుగుతుంది.

కండ‌రాలు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ నొప్పి  10 నిమిషాల వ‌ర‌కు ఉంటుంది. అనంతరం దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. కొంద‌రికి ఈ స‌మ‌స్య ఎప్పుడో ఒక‌సారి వ‌స్తుంది. కానీ కొంద‌రికి రోజూ రాత్రి సమయంలో ప‌గ‌లు కూడా ఇలా అవుతుంటుంది. 60 ఏళ్లు పైబ‌డిన వారికి స‌హ‌జంగానే ఈ విధమైన నొప్పి వస్తుంటుంది. కాలి పిక్కలు పట్టెయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయస్సు మీద పడడం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండడం, వ్యాయామం చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు, పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల పిక్కలు పట్టేస్తుంటాయి.

సమస్య నుండి ఉపశమనం కోసం ;

1.తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డలు కలిగిన ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

2.కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెలను సమభాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి. నొప్పి తగ్గుతుంది.

3.కొబ్బరినూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. అనంతం ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.

4. నీరు తగినంతగా తాగకపోతే డీహైడ్రేషన్ కారణంగా తొడ కండరాలు, పిక్కలు పట్టేస్తాయి. తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

5. శరీరంలో తగినంతగా పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు, కొబ్బరి బొండం నీళ్ళు తదితర ఆహారాలను తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది. కోడి గుడ్లు, పాలు, పెరుగు, చిలకడ దుంపలు, నట్స్, విత్తనాలు, అరటి పండ్లు, యాప్రికాట్స్, కివీ, నారింజ, బీట్ రూట్, తృణ ధాన్యాలు, కర్భూజ, క్యారట్, చేపలు, టమాటాలు లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది.

6. థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో ఈ సమస్య ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవారు తగిన చికిత్స పొందటం వల్ల పిక్కలు పట్టేయడం అన్న సమస్య తగ్గుతుంది.

7.రోజూ క‌నీసం 30 నిమిషాలు పాటు వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పొటాషియం, మెగ్నిషియం లాంటి ఖనిజ లవణాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.

8. కండ‌రాలు ప‌ట్టేయ‌కుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రించే ముందు 2 టీ స్పూన్ల అల్లం ర‌సం తీసుకోవాలి. అలాగే అశ్వ‌గంధ చూర్ణం ఒక‌ టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ పాల‌లో క‌లిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఫెరిఫెర‌ల్ న్యూరోప‌తి, పార్కిన్స‌న్‌, లివ‌ర్ జ‌బ్బులు, కిడ్నీ వ్యాధులు, ర‌క్త‌నాళాలు పూడుకుపోవ‌డం, వెరికోస్ వీన్స్ లాంటి వ్యాధులు ఉన్న‌వారికి ఎక్కువగా కండ‌రాలు ప‌ట్టేస్తుంటాయి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిని చికిత్స పొందాల్సి ఉంటుంది.