Arthritis In Women : ఆటో ఇమ్యూన్ సమస్యతో మహిళల్లో కీళ్ల వాతం !

కొంతవరకు దీనికి జన్యు స్వభావమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మగవారిలో ఎక్స్‌, వై క్రోమోజోములు, మహిళల్లో రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉంటాయి. ఈ అదనపు ఎక్స్‌ క్రోమోజోమ్‌ రోగనిరోధకశక్తితో ముడిపడిన చాలా జన్యువుల మీద ప్రభావం చూపి, ఫలితంగా శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందన అతిగా ప్రేరపితమవుతుంది.

Arthritis In Women : ఆటో ఇమ్యూన్ సమస్యతో మహిళల్లో కీళ్ల వాతం !

Arthritis in women with autoimmune problem!

Arthritis In Women : మహిళల్లో ఆటో ఇమ్యూన్ సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. మన రోగనిరోధక శక్తి మనమీదనే దాడి చేయటం వల్ల వచ్చే సమస్యల్లో కీళ్ల వాతం కూడా ఒకటి. దీనినే ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. కోవిడ్ తో ఈ తరహా సమస్యలు మరింత పెరిగాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ శరీరం యొక్క కీళ్ళపై దాడి చేసినప్పుడు, ప్రతిచర్యలు సంభవిస్తాయి. కీళ్ల నొప్పులు, గట్టితనం, కదలించే సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

ఈ వ్యాధి లక్షణాలకు సంబంధించి సాధారణంగా చేతులు, మణికట్టు, పాదాలలో వాపు, నొప్పులు ఉంటాయి. మోకాలి నొప్పి మరింత తీవ్రమవుతుంది. ఈ పరిస్థితి వల్ల సుమారుగా 75% మంది మహిళలు బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. కొందరిలో ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. జ్వరం, కీళ్ళ నొప్పి, దృఢత్వం, బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళలకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొంతవరకు దీనికి జన్యు స్వభావమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మగవారిలో ఎక్స్‌, వై క్రోమోజోములు, మహిళల్లో రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉంటాయి. ఈ అదనపు ఎక్స్‌ క్రోమోజోమ్‌ రోగనిరోధకశక్తితో ముడిపడిన చాలా జన్యువుల మీద ప్రభావం చూపి, ఫలితంగా శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందన అతిగా ప్రేరపితమవుతుంది. ఎక్స్‌ క్రోమోజోమ్‌ నుంచి పుట్టుకొచ్చే చాలా జన్యువులు పెద్దఎత్తున జన్యు మార్పులకు దారితీసేందుకు కారణమౌతాయి. ఈస్టోజన్‌, ప్రొజెస్టెరోన్‌ వంటి స్త్రీ హార్మోన్లు సైతం వ్యాధినిరోధక వ్యవస్థలో పాలు పంచుకుంటాయి. ఇవన్నీ మహిళలకు కీళ్లవాతం వంటి ఆటోఇమ్యూన్‌ జబ్బుల ముప్పు పెరిగేందుకు కారణం అవుతాయి.

అన్ని కీళ్లనొప్పులు ఆటో ఇమ్యూన్ వల్లే అనుకోవటం పొరపాటే అవుతుంది. వయసుతో పాటు కీళ్లు అరగటమూ నొప్పులకు దారితీయొచ్చు. పెద్ద వయసులో కీళ్ల నొప్పులు మొదలైతే చాలావరకు ఇదే కారణమై ఉండొచ్చు. రుమటాయిడ్‌ అర్థయిటిస్‌ చిన్న వయసులో అంటే 40 ఏళ్లలోపు వస్తుంది. కీళ్లను దెబ్బతీసి, ఆకారం మారిపోయేలా చేస్తుంది. దీనికి దీర్లకాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

బరువును అదుపులో ఉంచుకోవటం, రక్త ప్రసరణను ఉత్తేజపరిచేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , నడక, జాగింగ్‌, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటి వాటితో కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. ఒకవేళ సమస్య తలెత్తినా నియంత్రణలో ఉంచుకోవచ్చు.