పొట్టపెరిగితే మెమెరీ తగ్గుతుంది…!

  • Published By: sreehari ,Published On : July 11, 2020 / 05:09 PM IST
పొట్టపెరిగితే మెమెరీ తగ్గుతుంది…!

అధిక బరువు… అదేనండీ.. ఊభకాయం.. ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లతో పాటు సరైన వ్యాయామం కరువైపోయింది.  వ్యాయామం చేయనివారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు కూడా ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. చాలామందిలో శరీరంలో పొట్ట భాగం మాత్రం బానలా ఉబ్బిపోతోంది.

పొట్ట పెరిగిన వారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.. పొట్ట పెరిగే కొద్ది… మెదడులోని మెమెరీ  తగ్గిపోతుందని లండన్ యూనివర్శిటీ కాలేజీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  మెదడులో dementia వ్యాధికి దారితీస్తుందని కనుగొన్నారు.

ప్రతి 8 మరణాలలో డిమెన్షియా వ్యాధి ఒకటి :
ఊభకాయం, మతిమరుపుకు మధ్య సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. డిమెన్షియా వచ్చిన వారిలో 74 శాతం మంది ఊబకాయం ఉన్నట్టు తేలింది. ఊబకాయం ఉన్న మహిళల్లో డిమెన్షియా తరహా మతిమరుపు వ్యాధి వచ్చే ప్రమాదం 39 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చేశారు. ఇంగ్లాండ్‌లో ప్రతి 8 మరణాలలో ఒకటి 2017లో డిమెన్షియా వ్యాధి కారణమైందని అధ్యయనాలు వెల్లడించాయి.

డిమెన్షియాకు నడుము సైజుకు సంబంధం ఏంటి?
ఊబకాయం హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, స్ట్రోక్, డిమెన్షియాతో సహా అనేక ఆరోగ్య సమస్యలను ప్రభావితం చేస్తుంది. పెద్దవారిలో ఊబకాయం రేట్లు 1975 నుంచి మూడు రెట్లు పెరిగాయి. 2016లో, ఇంగ్లాండ్‌లో 39 శాతం మంది పెద్దలే ఉన్నారు. ఊబకాయం కలిగి ఉన్నారని అంచనా వేశారు.

డిమెన్షియా రేట్లు పెంచడంలో నడుము పెరగడంపై (WC) waist circumference పాత్ర పోషిస్తుందా అని అంచనా. ఇంగ్లీష్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఏజింగ్ నుంచి 6,582 మంది పాల్గొన్న వారిపై ఈ బృందం డేటాను తీసుకుంది. 18 సంవత్సరాల అధ్యయనంలో 18,000 మంది వాలంటీర్ల నుంచి ఈ సమాచారాన్ని సేకరించింది.

మహిళల్లోనే 39 శాతం డిమెన్షియా ముప్పు ఎక్కువ :
ఈ అధ్యయనం కోసం.. 50 ఏళ్లు పైబడిన పెద్దలను ఎంచుకున్నారు. వారి సాధారణ బరువు, అధిక బరువు గ్రూపులుగా విభజించారు. ఇందులో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఒకటి. ప్రత్యేక కొలత (పౌండ్లలో బరువు x 703) / (అంగుళాల ఎత్తు x అంగుళాల ఎత్తు)గా గుర్తించారు.  స్థూలకాయాన్ని మహిళలకు 35+ అంగుళాలు, పురుషులకు 40+ అంగుళాలుగా పేర్కొన్నారు. 6.9 శాతం మందికి 15 ఏళ్ల కాలంలో గరిష్టంగా డిమెన్షియా వచ్చినట్టు తేలింది. వారిలో 74 శాతం మంది అధిక బరువు ఉన్నట్టు తేలింది.  ఈ ఫలితాలు జనాభా, జీవనశైలి ప్రవర్తనలు, రక్తపోటు, మధుమేహం, డిమెన్షియాకు జన్యు ప్రమాద కారకం అయిన APOE E-ε4 నుంచి స్వతంత్రంగా ఉంటాయని గుర్తించారు.

సాధారణ మహిళలతో పోలిస్తే ఊభకాయంతో బాధపడుతున్న మహిళలకు డిమెన్షియా వచ్చే ప్రమాదం 39 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. మెదడు ఆరోగ్యం, నడుము పరిమాణం ముడిపడి ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఈ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.