Asafoetida : జీర్ణ క్రియలను మెరుగుపరచటం ద్వారా బరువు తగ్గటంలో సహాయపడే ఇంగువ !

ఇంగువ అధిక కొవ్వు వృద్ధిని తగ్గించడం ద్వారా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మరియు జీవక్రియ మెరుగుపరుస్తుంది, అందువలన అధిక బరువు నివారించుటలో సహాయపడుతుంది.

Asafoetida : జీర్ణ క్రియలను మెరుగుపరచటం ద్వారా బరువు తగ్గటంలో సహాయపడే ఇంగువ !

asafoetida

Asafoetida : ఇంగువ ఔషదలక్షణాలను కలిగి ఉంది. ఆయుర్వేదంలో దీనిని భేది మందుగా ఉపయోగిస్తారు. జీర్ణక్రియతోపాటు, పేగు కదలికలను ప్రోత్సహించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ సమస్యలకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంగువతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంగువతో ప్రయోజనాలు ;

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఆయుర్వేద బౌషధంలో జీర్ణాశయ సంబంధిత ఇబ్బందుల పరిష్కారం కోసం ఇంగువ ఉపయోగిస్తున్నారు. ఇది జీర్ణాశయంలో జీర్ణ రసాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్నాశయ వాయువు మరియు ఉబ్బరం తగ్గిస్తుంది.

2. జ్ఞాపకశక్తిని పెంచుతుంది: ఇంగువ యాంటీ ఆక్సిడెంట్‌, ఇది ఎసిటైల్కోలిన్‌ యొక్క విచ్చిన్నతను నిరోధిస్తుంది, ఇది మెదడు సంకేతాలను ప్రసారం చేయుటలో బాధ్యత వహిస్తుంది.
ఇది జ్ఞాపకశక్తిని కాపాడటం , జ్ఞానమును మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

3. బరువును తగ్గిస్తుంది: ఇంగువ అధిక కొవ్వు వృద్ధిని తగ్గించడం ద్వారా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మరియు జీవక్రియ మెరుగుపరుస్తుంది, అందువలన అధిక బరువు నివారించుటలో సహాయపడుతుంది.

4. రక్తపోటును తగ్గిస్తుంది: అధిక రక్తపోటు గల వ్యక్తులలో రక్తపోటుని తగ్గించడంలో ఇంగువ ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తనాళాల్లో సడలింపుకు ఇంగువ దోహదపడుతుంది తద్వారా రక్తపోటును తగ్గించవచ్చు.

5. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది: సాంప్రదాయిక బెషధాలలో ఇంగువ ఒక మూత్రవిసర్జనగా పిలువబడుతుంది. ఒక యాంటీ ఆక్సిడెంట్‌ కావడం వలన, మూత్రపిండాలకు నష్టం కలగకుండా చేస్తుంది. మూత్రపిండాల పనితీరు బాగా ఉండేలా చేస్తుంది.

6. సహజమైన యాంటీ మైక్రోబయాల్‌: ఇంగువ శక్తివంతమైన యాంటిమైక్రోబయల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటురోగాల చికిత్సలో ఆయుర్వేద బెషధంలో వాడుతున్నారు. ఇంగువ నూనె చాలా సాధారణ వ్యాధికారక బాక్టీరియా మరియు శిలీంద్రాలు పెరుగుదలను నిరోధించే గుణాన్ని కలిగి ఉంది. ఊరగాయ పచ్చళ్ళు, పులియబెట్టిన
ఆహారాలలో అవి చెడిపోకుండా ఎక్కువ కాలంలో నిల్వ ఉండేలా చేయటంలో సంరక్షణిగా ఉపయోగించబడుతుంది.