Ash Gourd Benefits : బూడిద గుమ్మడిలో ఫైబర్ పుష్కలం, రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచుతుంది!

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా బూడిద గుమ్మడి తోడ్పడుతుంది.

Ash Gourd Benefits : బూడిద గుమ్మడిలో ఫైబర్ పుష్కలం, రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచుతుంది!

Ash gourd is rich in fiber

Ash Gourd Benefits : బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఎన్నో ఆరోగ్య రుగ్మతలకు చికిత్సకు సహాయపడతాయి. బూడిద గుమ్మడికాయను తినడానికి అస్సలు ఇష్టపడని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే కూరగాయలలో ఒకటిగా చెప్పవచ్చు. గుమ్మడికాయతో వివిధ రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు.

బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.స్మూతీలు, జ్యూస్ లు, స్మూతీలు, సలాడ్ ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలం. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి. శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కరిగే ఫైబర్ వల్ల మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది.

అంతేకాదే దీనిలో ఆల్కలాయిడ్లు,టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. దీనిలో నీటి శాతం ఎక్కువ, కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియింత్రణలో ఉంచుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా బూడిద గుమ్మడి తోడ్పడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఈ ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఆహార కోరికలను కూడా తగ్గిస్తుంది. బరువును త్వరగా వేగంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడి మలబద్దకం, అజీర్థ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్లు, హైపర్ ఎసిడిటీ, డైస్పెప్సియా వంటి సమస్యలను తగ్గించడానికి ఉపకరిస్తుంది.