కరోనా నివారణకు ‘అశ్వగంధ’ ఔషధం!

  • Published By: srihari ,Published On : May 19, 2020 / 02:49 AM IST
కరోనా నివారణకు ‘అశ్వగంధ’  ఔషధం!

ఆయుర్వేద హెర్బ్ అశ్వగంధ సహజ మూలికలు, పుప్పొడికి COVID-19 చికిత్స, నివారణకు ఔషధ లక్షణాలున్నాయని ఐఐటి- ఢిల్లీ పరిశోధకులు జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AIST) సహకారంతో కనుగొన్నారు. DAILAB (DBT-AIST ఇంటర్నేషనల్ లాబొరేటరీ ఫర్ అడ్వాన్స్‌డ్ బయోమెడిసిన్) నుండి ప్రొఫెసర్ డి.సుందర్ నేతృత్వంలోని పరిశోధకులు తమ అధ్యయనాన్ని Journal of Biomolecular Structure and Dynamicsలో ప్రచురించడానికి అంగీకరించారని, త్వరలో ప్రచురించే అవకాశం ఉందని చెప్పారు. 

SARS-CoV-2 వైరస్ జన్యువు, నిర్మాణం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మాటిక్స్ ప్రయోగాత్మక టూల్స్ ఉపయోగించి ఔషధ రూపకల్పన, వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. గత కొన్నేళ్లుగా అశ్వగంధ పుప్పొడి నుండి సహజ సమ్మేళనాలపై పనిచేస్తున్న DAILAB, AIST జపాన్, వారి బయో-యాక్టివ్స్‌లో కొన్ని SARS-CoV-2తో ఇంట్రాక్ట్ అయినట్టు గుర్తించాం’ అని IIT-D ఒక ప్రకటనలో తెలిపింది. అశ్వగంధ, పుప్పొడి నుంచి సహజ సమ్మేళనాలు సమర్థవంతమైన COVID-19 ఔషధంగా పనిచేయడానికి అవకాశం ఉంది” అని బృందం నివేదించినట్లు IIT-D తెలిపింది.

ప్రోటీన్లు విభజించడానికి ప్రధాన SARS-CoV-2 ఎంజైమ్‌ను పరిశోధకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీనిని మెయిన్ ప్రోటీజ్ లేదా Mpro అని పిలుస్తారు. ఇది వైరల్ రెప్లికేషన్‌కు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వైరస్‌కు ఆకర్షణీయమైన ఔషధ లక్ష్యం. న్యూజిలాండ్ పుప్పొడి క్రియాశీల పదార్ధమైన అశ్వగంధ (Withania somnifera) కెఫిక్ యాసిడ్ ఫెనెథైల్ ఈస్టర్ (CAPE) నుండి తీసుకున్న సహజ సమ్మేళనం విథానోన్ (Wi-N) సంభావ్యతను కలిగి ఉందని కనుగొన్నారు. ప్రస్తుతం ఈ అధ్యయనం సమీక్షలో ఉంది. భవిష్యత్తులో ప్రచురించబడుతుందని భావిస్తున్నారు. 

Read: కొవిడ్-19 ఔషధ అభివృద్ధి రేసులో రెండు జపాన్ డ్రగ్స్