Ashwagandha: ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ

పురుషలలో వీర్యం ఉత్పత్తికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. వీర్యంలో ఉండే శుక్ర‌క‌ణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. శుక్రకణాల క‌ద‌లిక‌లు బాగుంటాయి. సంతాన లోపం స‌మ‌స్య ఉన్న పురుషులు అశ్వ‌గంధ‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అశ్వ‌గంధ‌ను నిత్యం తీసుకుండే కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌క్తి పెరుగుతుంది. బ‌ల‌హీనంగా ఉన్న‌వారు దీనిని తీసుకుంటే దృఢంగా మారటం ఖాయమని చెప్పవచ్చు.

Ashwagandha: ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ

Ashwagandha

Ashwagandha : ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధకు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కింగ్ ఆఫ్ ఆయుర్వేదాగా చెప్పవచ్చు. ఆయుర్వేదంలో అనేక రకాల ఔష‌ధాల త‌యారీలో అశ్వగంధను ఉప‌యోగిస్తారు. సుమారుగా 3వేల ఏళ్ల కింద‌టి నుంచే అశ్వ‌గంధ‌ను ఉప‌యోగిస్తున్నారు. 1.25 మీటర్ల ఎత్తు కలిగి గుబురుగా పొదలా పెరిగే మొక్క. దీని ఆకులు, వేర్లు, పండ్లు కాండం అన్నీ ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. సమశీతోష్ణ ప్రాంతాల్లో అశ్వగంధ విరివిగా పెరుగుతుంది.

అశ్వ‌గంధ‌కు చెందిన వేర్ల పొడి చూర్ణం రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో మ‌న‌కు అందుబాటులో ఉంది. ఆయుర్వేద వైద్య విధా నాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి మొదలైనవి ఆయుర్వేద దుకాణాలలో లభిస్తున్నాయి. అశ్వ‌గంధ‌ను నిత్యం వాడడం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అశ్వ‌గంధ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో దీనికి సాటి మరొకటి లేదనే చెప్పాలి. శ‌రీరంలో శ‌క్తి, ఏకాగ్ర‌త పెంచేందుకు ఉపయోగపడుతుంది. కాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. నరాల వీక్ నెస్ ను తగ్గిస్తుంది.

డిప్రెష‌న్‌ను త‌గ్గించేందుకు కూడా అశ్వ‌గంధ స‌హాయ ప‌డుతుంద‌ని సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నిత్యం 600 మిల్లీగ్రాముల మోతాదులో అశ్వ‌గంధను 60 రోజుల పాటు కొంద‌రికి ఇవ్వ‌గా వారిలో డిప్రెష‌న్ స్థాయిలు త‌గ్గిన‌ట్లు గుర్తించారు.సంతాన లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి అశ్వ‌గంధ ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిల‌ను పెంచుతుంది. దీంతోపాటు జ‌న‌నావ‌య‌వాల ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. ఈ క్ర‌మంలో పురుషుల్లో ఉండే సంతాన లోపం స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

అశ్వ‌గంధ‌లో అధిక మోతాదుతో ఉండే విత‌నోలైడ్స్ వాపుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తాయి. ట్యూమ‌ర్లు వృద్ధి చెంద‌కుండా చూస్తుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గిస్తుంద‌ని పలు పరిశోధనల్లో తేలింది. అశ్వ‌గంధ‌ను వాడ‌డం వ‌ల్ల ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీంతో కండ‌రాలు ఇన్సులిన్‌ను స‌మ‌ర్థవంతంగా ఉప‌యోగించుకుంటాయి. ఈ క్ర‌మంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెరను ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచటంలో అశ్వగంధ బాగా సహాయకారిగా పనిచేస్తుంది.

అశ్వ‌గంధ‌లో విథ‌ఫెరిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం క్యాన్స‌ర్ క‌ణాల‌ను పెర‌గ‌కుండా నిలువరిస్తుంది. క్యాన్సర్ రాకుండా చూస్తుంది. బ్రెస్ట్‌, లంగ్‌, కోల‌న్‌, బ్రెయిన్, ఓవేరియ‌న్ క్యాన్స‌ర్లు దరిచేరనివ్వదు. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగటం, పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు కూడా బాగా పెరుగుతుంటే అలాంటి వారు అశ్వ‌గంధ‌ను తీసుకోవాలి. అశ్వ‌గంధ‌ను నిత్యం తీసుకున్న‌ట్ల‌యితే ఒత్తిడితోపాటు ఆందోళ‌న కూడా త‌గ్గుతుంద‌ని పరిశోధనల్లో తేలింది.

పురుషలలో వీర్యం ఉత్పత్తికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది. వీర్యంలో ఉండే శుక్ర‌క‌ణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. శుక్రకణాల క‌ద‌లిక‌లు బాగుంటాయి. సంతాన లోపం స‌మ‌స్య ఉన్న పురుషులు అశ్వ‌గంధ‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. అశ్వ‌గంధ‌ను నిత్యం తీసుకుండే కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌క్తి పెరుగుతుంది. బ‌ల‌హీనంగా ఉన్న‌వారు దీనిని తీసుకుంటే దృఢంగా మారటం ఖాయమని చెప్పవచ్చు.

అశ్వ‌గంధ‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్పెరుగుతుంది. అశ్వ‌గంధ‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చుండ్రు, దురద, సోరియాసిస్, తామర, మంట వలన కలిగే ఇతర అలెర్జీ వంటి నెత్తిమీద వ్యాధులను నియంత్రిస్తుంది

మోతాదుకు మించితే దుష్ప‌రిణామాలు ఎదురయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఏక్కువ రోజులు వాడితే గుండెపైన , అడ్రినల్ గ్రాందుల పైన చెడుప్రభావము చూపుతుంది. గర్భధారణతో ఉన్న మహిళలు అశ్వగంధకు దూరంగా ఉండాలి. అకాల ప్రసవానికి కారణమవుతుంది. పాలిచ్చే తల్లులు అశ్వగంధను తీసుకోకూడదు. క‌నుక తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్న‌వారు వైద్యుల సూచ‌న మేర‌కు అశ్వ‌గంధ‌ను వాడుకోవ‌డం మంచిది.