Asteroid Fly Earth : స్టేడియం సైజులో భారీ ఆస్టరాయిడ్.. భూమివైపు దూసుకొస్తోంది!

అదృష్టవశాత్తూ.. భూమివైపు దూసుకొచ్చిన భారీ సౌర తుఫాను ముప్పు తప్పిపోయింది. ఇంతలో మరో ముప్పు భూమికి పొంచి ఉందంటూ చైనా పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Asteroid Fly Earth : స్టేడియం సైజులో భారీ ఆస్టరాయిడ్.. భూమివైపు దూసుకొస్తోంది!

Asteroid The Size Of Stadium To Fly Past Earth On July 24 (1)

Asteroid size of stadium to fly past Earth : అదృష్టవశాత్తూ.. భూమివైపు దూసుకొచ్చిన భారీ సౌర తుఫాను ముప్పు తప్పిపోయింది. ఇంతలో మరో ముప్పు భూమికి పొంచి ఉందంటూ చైనా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. జూలై 24న అంతరిక్షంలో నుంచి స్టేడియం సైజు ఉన్న అతిపెద్ద ఆస్టరాయిడ్ (గ్రహశకలం) భూమివైపు దూసుకొస్తోంది. అదే.. ‘2008 GO20’ అనే గ్రహశకలం.. ఈ భారీ గ్రహశకలం గంటకు 18వేల మైళ్ల వేగంతో భూమివైపు దూసుకొస్తోంది.

అయితే ఈ గ్రహశకలం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికన్ సైన్స్ ఏజెన్సీ నాసా (NASA) ఒక ప్రకటనలో వెల్లడించింది. నాసా ప్రకారం.. ఈ గ్రహశకలం జూలై 24న భూమికి అతిదగ్గరగా వెళ్లనుంది. ఇది అపోలో క్లాస్ (Apollo Class) గ్రహశకలంగా పేర్కొంది. ఒక స్టేడియం కంటే పెద్దదిగా లేదా తాజ్ మహల్ పరిమాణంతో పోలిస్తే.. మూడు రెట్లు పెద్దదిగా గుర్తించారు.

ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తున్నప్పటికి… భూమికి 0.04 au (astronomical unit) దూరం నుంచి వెళ్లనుంది. భూమికి, ఆస్టరాయిడ్‌కి మధ్య 3,718,232 మైళ్ల దూరం ఉండనుంది. అదే చంద్రుడు, భూమికి మధ్య దూరం సుమారు 2,38,606 మైళ్లు ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ 2008 GO20 జులై 25న ఉదయం 3 గంటల భూమికి దగ్గరగా వస్తుంది. భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

గ్రహశకలాలు ఏంటి? :
నాసా ప్రకారం.. ఆస్టరాయిడ్స్ అనేవి.. సుమారు 4.6 బిలియన్ ఏళ్ల క్రితమే సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి రాతి అవశేషాలుగా ఉన్నాయి. ప్రస్తుతం విశ్వంలో 1,097,106 గ్రహశకలాలు ఉన్నాయి. ఉల్కల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ అతిపెద్ద భారీ ఆస్టరాయిడ్ గమనాన్ని పక్కకు మరలించేందుకు చైనా పరిశోధకులు భారీ రాకెట్లను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2021 నుంచి 2022 ఆరంభంలో అమెరికా రొబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయబోతోంది. భూమికి అతిదగ్గరగా వచ్చే రెండు ఆస్టరాయిడ్లను అడ్డుకునేందుకు ఈ రొబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించనుంది.