Covid Recovery: ఆస్తమా ఇన్‌హేలర్స్‌తో 3రోజుల్లోనే కొవిడ్ నుంచి రికవరీ

ఆస్తమా ఇన్‌హేలర్స్ వాడి కొవిడ్ నుంచి వేగవంతంగా 3రోజుల్లోనే రికవరీ అవ్వొచ్చని నిపుణులు అంటున్నారు. కరోనాకు భయపడుతూ హాస్పిటలైజేషన్ అంటేనే భయపడుతున్న క్రమంలో.. ప్రత్యేకించి ఆస్తమా పేషెంట్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Covid Recovery: ఆస్తమా ఇన్‌హేలర్స్‌తో 3రోజుల్లోనే కొవిడ్ నుంచి రికవరీ

Covid Recovery

Covid Recovery: ఆస్తమా ఇన్‌హేలర్స్ వాడి కొవిడ్ నుంచి వేగవంతంగా 3రోజుల్లోనే రికవరీ అవ్వొచ్చని నిపుణులు అంటున్నారు. కరోనాకు భయపడుతూ హాస్పిటలైజేషన్ అంటేనే భయపడుతున్న క్రమంలో.. ప్రత్యేకించి ఆస్తమా పేషెంట్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. యూకేలో రోజుకు 226మంది చొప్పున హాస్పిటల్ పాలై మొత్తం 13వందల 16మంది చికిత్స తీసుకుంటున్నారు.

వారందరికీ కేసును బట్టి ఇన్‌హేలర్స్ డోసేజ్ మార్చి తీసుకోమంటూ సూచించారు డాక్టర్లు. వ్యాక్సిన్లు వేసుకుంటున్నంత మాత్రాన కేసులు రాకుండా ఉండవు కదా.. అందుకే ఇలాంటి చికిత్స అందిస్తున్నామంటున్నారు వైద్యులు.

అంతకుముందు ఎనిమిది రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి రికవరీ అయ్యేవారు. ఇప్పుడు అది మూడు రోజులకు తగ్గింది. ఇన్‌హేలర్స్ వాడటం వల్ల మూడు రోజుల్లోనే కోలుకోగల్గుతున్నారు. హాస్పిటలైజ్ కాకుండా 65ఏళ్లు పైబడ్డ వారికి ఇన్‌హేలర్‌తో ట్రీట్మెంట్ తీసుకోమని సూచిస్తున్నాం. దీనిపై ఆల్రెడీ ట్రయల్స్ పూర్తయ్యాయని హెల్త్ మినిష్టర్ చెబుతున్నారు.

ఈ ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో పూర్తి మానిటరైజ్ చేస్తున్నామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు అంటున్నారు.