Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

వర్షాకాలంలో చల్లని వాతావరణం, చల్లని గాలి ఆస్తమా ఇబ్బందిని మరింత పెంచుతుంది. పరిసరాలలో నిరంతర తేమ కారణంగా ఫంగస్ ఏర్పడుతుంది, ఇది ఆస్తమా రోగులకు అలెర్జీని కలిగిస్తుంది. ఆస్తమా వల్ల వయస్సు పైబడిన వారిలో ప్రాణహాని కలుగుతుంది.

Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

Asthma Patients

Asthma Patients : దీర్ఘకాలిక శ్వాససంబంధిత వ్యాధుల్లో ఆస్తమా కూడా ఒకటి. పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఉండే వాయు నాళాలు సన్నబడటం కారణంగా పీల్చే గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరమౌతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. దీనినే ఆస్తమాగా చెప్పవచ్చు.

వర్షాకాలంలో చల్లని వాతావరణం, చల్లని గాలి ఆస్తమా ఇబ్బందిని మరింత పెంచుతుంది. పరిసరాలలో నిరంతర తేమ కారణంగా ఫంగస్ ఏర్పడుతుంది, ఇది ఆస్తమా రోగులకు అలెర్జీని కలిగిస్తుంది. ఆస్తమా వల్ల వయస్సు పైబడిన వారిలో ప్రాణహాని కలుగుతుంది. యువకుల్లో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా ఆస్తమా రావడానికి కారణంగా చెప్పవచ్చు. ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం, రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఆస్థమా వస్తుంది.

వర్షాకాలం దానితో పాటు సాధారణ జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, కలరా మరియు హెపటైటిస్ A వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. ఆస్తమా రోగులు తరచుగా చలి, తేమ, వర్షం వల్ల ఆస్తమాతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వర్షాకాలంలో ఆస్తమా రోగులు తగిన జాగ్రత్తలు పాటించాలి. వేడి పానీయాలు తీసుకోవాలి. వేడి సూప్‌లు తాగాలి. ఇలా చేయటం వల్ల నాసికా భాగాలను క్లియర్ గా ఉంచుకోవచ్చు. తేనెతో కూడిన హెర్బల్ పానీయాలు నాసికా రంధ్రాలు ఫ్రీగా ఉండేలా చేస్తాయి. ఇంట్లోకి దుమ్ము , ధూళి, పురుగులు వంటివి వర్షాకాలంలో రాకుండా నివారించండి. వీటి వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిది. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో ఆపిల్, పచ్చిపఠానీ, పాలకూర, దానిమ్మ, ఆరంజ్, వంటి వాటిని తీసుకోవాలి. బెడ్ షీట్ష్, దిండు కవర్లను వేడినీటిలో నానబెట్టి ఉతుక్కోవాలి.