Microdermabrasion : మైక్రోడెర్మాబ్రేషన్‌ పరికరంతో ముఖంపై ముడతలు, మచ్చలు మాయం

ల్యాప్‌టాప్‌లా ఉన్న ఈ సిస్టమ్‌లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్‌ బటన్, మోడ్‌ సెలెక్షన్‌ బటన్, స్టార్ట్‌, స్టాప్‌ బటన్, లెవల్స్‌., ఏరియా బటన్, ఎల్‌సిడి స్క్రీన్‌ ఉంటాయి.

Microdermabrasion : మైక్రోడెర్మాబ్రేషన్‌ పరికరంతో ముఖంపై ముడతలు, మచ్చలు మాయం

Microdermabrasion

Microdermabrasion : ఎదుటివారు చూస్తే ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటారు చాలా మంది. అయితే సహజంగా యవ్వనంలో వచ్చే వివిధ రకాల సమస్యలకారణంగా ముఖంపై మచ్చలు, ముడతలు ఏర్పడతాయి. వీటి వల్ల అందమైన ముఖం కాస్త చాలా పెద్ద వయస్సున్న వారిలా కనిపిస్తుంటుంది. ఇందుకోసం చాలా మంది మేకప్ లు, టచ్ అప్ లతో ముఖం అందంగా కనిపించేలా చేస్తుంటారు. ఇక పెద్ద వయస్సు వారిలో ముఖంపై చర్మం సాగిపోయి, బాగా ముడతలు పడిపోయి ఉంటుంది. అలాంటి వారు తాము నిత్య యవ్వనంగా కనిపించాలని కోరుకుంటుంటారు. ఇందుకోసం పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటి వారికోసం ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త తరహా యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చింది.

మైక్రోడెర్మాబ్రేషన్‌ పేరుతో పిలవబడే ఈ సిస్టమ్‌ చర్మం సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. చూడటానికి సిస్టమ్‌లానే, మినీ ల్యాప్‌టాప్‌లా కనిపించే… ఈ డివైజ్‌ వయసుతో వచ్చే ముడతలను, గీతలను పోగొడుతుంది. చర్మానికి తగిన స్పాను అందిస్తుంది. ఈ మధ్యకాలంలో దీని వినియోగం కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా మధ్య వయస్కులు దీనిని ఉపయోగిస్తూ ముఖ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆటో మోడ్, సెన్సిటివ్‌ మోడ్, మాన్యువల్‌ మోడ్‌.. అనే మూడు వేరువేరు మోడ్స్‌తో చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌ స్క్రబ్‌ను అందిస్తుంది. సిస్టమ్‌కి కుడివైపున అటాచ్‌ అయిన పొడవాటి ట్యూబ్‌ లాంటిది ఉంటుంది. దానికే మరో చివర, డివైజ్‌తో పాటు లభించే.. 3 విడి భాగాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ట్రీట్మెంట్‌ తీసుకోవాలి

ఇక ట్రీట్ మెంట్ వివరాలను పరిశీలిస్తే.. చర్మంపై రంధ్రాలను లేకుండా చేసేందుకు పార్ట్ పోర్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ టిప్‌ , చర్మంపై మృతకణాలను, వ్యర్థాలను తొలగించే పార్ట్‌ మాగ్నెటిక్‌ ఇన్ఫ్యూజర్‌ టిప్‌ , చర్మంపై ముడతలు,గీతలు తొలగించే డైమండ్‌ టిప్‌ . వాటిని అమర్చిన తర్వాత.. ప్లాస్టిక్‌ వాండ్‌ను పెన్‌ లా చేతితో పట్టుకుని, చర్మానికి టచ్ చేసి ఉంచితే సరిపోతుంది. ఇలా చేయటం ద్వారా తిరిగి యవ్వనంగా కనిపించేలా మీచర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది.

ల్యాప్‌టాప్‌లా ఉన్న ఈ సిస్టమ్‌లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్‌ బటన్, మోడ్‌ సెలెక్షన్‌ బటన్, స్టార్ట్‌, స్టాప్‌ బటన్, లెవల్స్‌., ఏరియా బటన్, ఎల్‌సిడి స్క్రీన్‌ ఉంటాయి. దీని ధర సుమారు 179 డాలర్లు. అంటే 13,405 రూపాయలు. తమకుతాముగా దీనిని ఆపరేట్‌ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ట్రీట్మెంట్‌ తీసుకోవచ్చు. పవర్‌ అడాప్టర్, క్లీనింగ్‌ బ్రష్, రీప్లేస్‌మెంట్‌ ఫిల్టర్స్‌ , మెషిన్‌తో పాటు లభిస్తాయి. ఈ రీప్లేస్ మెంట్ ఫిల్డర్లను మార్చుకోవాల్సి ఉంటుంది.

ముఖ సౌందర్యం కోసం ఇటీవలికాలంలో చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన పరికరాలను కొనుగోలు చేసుకుని ఇంటి వద్దే వాటితో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఎలాంటి సౌందర్య సాధనం కొనుగోలు చేయాలన్నా ముందుగా వాటికి గురించి పూర్తిగా స్టడీ చేయటం మంచిది. ఎందుకంటే ఎంతో ఖర్చుచేసి కొనుగోలు చేసే పరికరం వల్ల తరువాత ఎలాంటి ఉపయోగం లేకుంటే చివరకు నిరుత్సాహం చెందాల్సి వస్తుంది.