Autism : చిన్నారులకు ఆటిజం ముప్పు! తల్లిదండ్రులు సకాలంలో స్పందిస్తే!

వీటిని గుర్తించి ముందునుంచే జాగ్రత్త పడడం మంచిది. మరీ ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువగా కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే ఆటిజం సమస్య నుండి వారిని సులభంగా బయటపడవేయవచ్చు.

Autism : చిన్నారులకు ఆటిజం ముప్పు! తల్లిదండ్రులు సకాలంలో స్పందిస్తే!

Autism Threat To Children

Autism : ఆటిజం సమస్య ఇటీవలి కాలంలో ఎదుగుతున్న చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు పనితీరులో లోపం కారణంగా ప్రధానంగా ఈ ఆటిజం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదొక వ్యాధి కాక పోయినప్పటికీ దీని వల్ల చిన్నారులు, వారి తల్లి దండ్రులు పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఇటీ వలి కాలంలో మన దేశంలో ఆటిజం కేసులు పెరిగి పోయాయి. మానసిక వైద్యుల వద్దకు ఆటిజం లక్షణాలతో వస్తున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆటిజాన్ని గుర్తించటం ఎలా?

తమ చిన్నారులు ఆటిజం సమస్యతో బాధపడుతున్నట్లు చాలా మంది తల్లిదండ్రులు గుర్తుపట్టలేరు. వినికిడి వీరిలో సాధారణంగానే ఉంటుంది. అయితే పిలిచినా పలికే పరిస్ధితి ఉండదు. ఆటిజంలో ప్రధానమైన లక్షణం పిలిస్తే పలకపోవటమే. నేరుగా కళ్ళల్లోకి చూడలేరు. ఎదుటివారిని చూస్తూ మాట్లాడలేకపోవటం, ఇతరులతో కలవకుండా ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుండడం, తమకి ఏం కావాలో చెప్పలేకపోవటం, మాటలు కూడా సరిగా రాకపోవడం ,ఎక్కువగా ఏడుస్తుండడం, ఎలాంటి ఫీలింగ్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం ,దెబ్బలు తగిలినా తెలుసుకోలేకపోవడం. చెవులుగట్టిగా మూసుకోకపోవడం, పిలిచినా పలకకపోవటం వంటి మరికొన్ని లక్షణాలను ఆటిజంతో బాధపడే పిల్లలో కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించి ముందునుంచే జాగ్రత్త పడడం మంచిది. మరీ ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువగా కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే ఆటిజం సమస్య నుండి వారిని సులభంగా బయటపడవేయవచ్చు. ఆటిజం సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారులతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల్లోనే అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఏది ఏమైన ఆటిజం సమస్యను త్వరితగతిన గుర్తించటం ద్వారా ఆటిజం సమస్య నుండి పిల్లలను త్వరితగతిన బయపడేసేందుకు వీలుంటుంది. వైద్యుడి సలహాల మేరకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్య తగ్గుతుంది.