Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో! |Avocado lowers blood pressure and keeps the heart healthy!

Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో!

రోజాలకు షైనింగ్ కోసం అవొకాడోను మెత్తగా పేస్ట్ లాగా చేసి దానికి కోడిగుడ్డు తెల్లసొన, ఒక టీస్పూన్ ఆలివ్ అయిల్ కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత నీటితో కడుక్కోవాలి. దీంతో సిల్కీ శిరోజాలు సొంతమౌతాయి.

Avocado : రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచే అవొకాడో!

Avocado : పోషకాలు పుష్కలంగా లభించే పండ్లలో అవకాడో ఒకటి. ఇందులో 25 రకాల పోషకాలు ఉన్నాయి. చర్మసంరక్షణలో ఉపయోగపడతాయి. అవొకాడోలో విటమిన్ ఎ, బి,సి,ఇ,కె, ఐరన్ , మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ తో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫైబర్, ప్రొటీన్, బీటా, సైటో స్టెరాల్, గ్లూటథయోన్, ల్యూటెన్ వంటి ఫైటో కెమికల్స్ ఉన్నాయి.

విటమిన్ బి6, ఫోలికాసిడ్ సైతం అవొకాడోలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి హోమోసిస్టన్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేస్తాయి. ఈ లెవల్స్ కనుగ పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెను ఆరోగ్యంగా
ఉంచుతాయి. అవొకాడోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అవొకాడోలో ఉండే కెరొటినాయిడ్ ల్యూటిన్ కళ్లను కాపాడుతుంది. వయసు పైబడటం వల్ల వచ్చే కాంటరాక్ట్ సమస్యలను దరిచేరకుండా చూస్తుంది.

బరువు పెరగాలనకునే వారికి అవొకాడో మంచి ఆహారం. ఇందులో హెల్ధీ కెలరీలు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగటానికి ఇవి దోహదం చేస్తాయి. ఈ పండులో ఫోలెట్ అధికంగా ఉంటుంది. ఇదిగుండెపోటు రిస్క్ల లను తగ్గిస్తుంది. డ్రైస్కిన్ తో బాధపడుతున్న వారు అవొకాడో జ్యూస్ ను రోజు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. జ్యూస్ తాగటం ఇష్టపడని వారు అవొకాడో అయిల్ ను శరీరానికి రాసుకుంటే చర్మం నునుపుగా, మెత్తగా మారతుంది.

శిరోజాలకు షైనింగ్ కోసం అవొకాడోను మెత్తగా పేస్ట్ లాగా చేసి దానికి కోడిగుడ్డు తెల్లసొన, ఒక టీస్పూన్ ఆలివ్ అయిల్ కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత నీటితో కడుక్కోవాలి. దీంతో సిల్కీ శిరోజాలు సొంతమౌతాయి. అవొకాడోను మెత్తగా నూరి తేనె, పెరుగు కలిపి ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకుంటే మృతకణాలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. కళ్ల కింద బ్యాగులు ఉన్నవారు అవొకాడో ఫ్రూట్ ను ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

×