Arthritis Headaches : కీళ్ళనొప్పులు, తీవ్రమైన తలనొప్పి తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

ఉమ్మెత్తాకులు వేడిచేసి మందంగా వేసి కట్టినా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అదే విధంగా వావిలాకులు, చింతచెట్టు ఆకులను కొంచెం వేడి చేసి కట్టినా ఫలితం ఉంటుంది.

Arthritis Headaches : కీళ్ళనొప్పులు, తీవ్రమైన తలనొప్పి తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

Pains

Arthritis Headaches : మధ్యవయస్సుల నుండి వృద్దుల వరకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీళ్ళ నొప్పులు, వాపులను ప్రధానంగా చెప్పవచ్చు. ఆ వయస్సుల వారు సర్వసాధారణంగానే ఈ తరహా సమస్యలతో సతమత మౌతుంటారు. అలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు చిన్నపాటి ఆయుర్వేద చిట్కాలతో ఆసమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

1. నువ్వుల నూనె పావు కప్పు తీసుకొని అందులో చితగొట్టిన వెల్లల్లిపాయలు రెండు వేసి బాగా కాచి వడపోయాలి. ఆ నూనెను రోజుకు మూడుసార్లు నొప్పులున్న చోట బాగా మర్ధన చేస్తుంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి…

2. నీరుల్లిపాయలను పొయ్యిలో కాల్చి మెత్తగా నూరి నొప్పి, వాపుగల ప్రాంతాల్లో రెండు పూటలా మందంగా పట్టిస్తుంటే అవి క్రమంగా తగ్గిపోతాయి.

3. ఉమ్మెత్తాకులు వేడిచేసి మందంగా వేసి కట్టినా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అదే విధంగా వావిలాకులు, చింతచెట్టు ఆకులను కొంచెం వేడి చేసి కట్టినా ఫలితం ఉంటుంది.

4. మెంతుల చూర్ణం ఒక టీ చెంచా మోతాదుగా ప్రతిరోజు ఒకసారి నీటితో మింగితే కీళ్ళనొప్పులు , శరీర నొప్పులు తగ్గిపోతాయి.

5. తలనొప్పి ఎక్కవగా ఉన్నప్పుడు దాల్చిన చెక్కను నీటితో నూరి కణతలకు రాస్తే తగ్గిపోతుంది.

6. రావిచెట్టు కాయలను మెత్తగా నూరి ఆగుజ్జను నుదిటిపై రాసినా తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే నువ్వుల నూనెను రోజూ తలకు మర్ధన చేయటం వల్ల రక్త ప్రసరణ జరిగి నొప్పి తొలగిపోతుంది.

7. వెల్లుల్లిపాయలను నూరి కణతలకు పట్టులాగా వేయాలి. అలాగే ఖర్జూర గింజలు నీటితో నూరి రాయవచ్చు. దీని వల్ల తలనొప్పి పోతుంది.

8. కుంకుడు చెట్టు ఆకులను తలకు దట్టంగా కట్టినా తలనొప్పి తగ్గుతుంది.

పైని చెప్పిన చిట్కాలన్నీ ఆయుర్వేద వైద్యుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత చేస్తే మంచిది.