Cough : దగ్గును సులభంగా తగ్గించుకునే ఆయుర్వేద చిట్కాలు!
పిప్పళ్లు, అల్లం, తుంగమస్తలు, పసుపు, కరక్కాయ సమభాగాలుగా తీసుకుని చూర్ణంగా చేయాలి. దానికి తేనె లేదంటే పంచదార కలిపి పేస్టుగా చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.

Cough : గొంతులో కఫదోషం కారణంగా వచ్చే దగ్గును ఆయుర్వేదంలో కాసరోగం అంటారు. అదే ఇంగ్లీషులు కాఫ్ అని పిలుస్తారు. వాత, పిత్త, శ్లేష్మ దోషాల వల్ల దగ్గు వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. దగ్గు సమస్య వచ్చిన తరువాత దానికి చికిత్స అందించకుండా వదిలేస్తే అది చివరకు ఊపరితిత్తుల క్షయ వ్యాధిగా మారుతుంది. ప్రధానంగా దగ్గులో మూడు రకాలు ఉన్నాయి. కఫంతో పాటు వచ్చే దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు, కఫం, రక్తంతోపాటు వచ్చే దగ్గు. కొన్ని సందర్భాల్లో కంఠ భాగంలో కలిగే గాయాల వల్ల సైతం రక్తంతో కలిసి, కఫం వస్తుంది. దీన్ని తీవ్రమైనదిగా గుర్తించాలి. దగ్గు సమస్యను తగ్గించుకునేందుక ఆయుర్వేద సూచిస్తున్న కొన్ని చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. ఖర్జూరం , మిరియాలు, విడంగాలు, పిప్పళ్లు, తేనె సమభాగాలుగా కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. టీ స్పూన్ అతి మధుర చూర్ణాన్ని టీస్పూన్ తేనె లేదంటే పంచదారతో కలిపి తింటే కఫం పడిపోయి దగ్గుతగ్గుతుంది.
3. అరగ్రాము మిరియాల చూర్ణం, నెయ్యి, చక్కెర , తేనె కలిపి తింటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
4. పిప్పళ్లు, అల్లం, తుంగమస్తలు, పసుపు, కరక్కాయ సమభాగాలుగా తీసుకుని చూర్ణంగా చేయాలి. దానికి తేనె లేదంటే పంచదార కలిపి పేస్టుగా చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.
5. 25 గ్రాముల చెరుకు రసంలో 25 గ్రాముల నెయ్యి కలిపి , నెయి మిగిలే వరకు బాగా వేడి చేయాలి. ఆ నెయ్యిని తాగితే క్షయతో వచ్చిన దగ్గు తగ్గుతుంది.
6. తామరగింజల చూర్ణానికి తేనె కలిపి తీసుకుంటే పైత్య దోషం వల్ల వచ్చిన దగ్గు పోతుంది.
7. తమలపాకుల రసాన్ని వెడిచేసి చల్లారిన తరువాత దానికి తేనె కలిపి తాగితే గడ్డ కట్టిన కఫం కరిగి దగ్గు తగ్గిపోతుంది.
8. టేబుల్ స్పూన్ తులసి ఆకుల రసానికి తగినంత తేనె కలపి తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
9. మిరియాల చూర్ణం, నెయ్యి , చక్కెర కలిపి టీ స్పూన్ చొప్పున తింటే దగ్గు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
10. రెండు చిటికెల లవంగాల చూర్ణం, తేనె, పటిక బెల్లం చూర్ణంలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక; ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల నుండి సేకరించటం జరిగింది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన సమస్యల ఉంటే వైద్యుడిని కలిసి వారు సూచించిన విధంగా తగిన చికిత్స పొందటం మంచిది.
1Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
2Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
3Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
4Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
5Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
6Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
7Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
8YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
9CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
10Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!