ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా? 

భారతీయులు బంగారానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి వేడుకుల నుంచి ప్రతి ఫంక్షన్లో బంగారం తళుకుమని మెరవాల్సిందే.

  • Published By: sreehari ,Published On : April 23, 2019 / 11:56 AM IST
ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా? 

భారతీయులు బంగారానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి
వేడుకుల నుంచి ప్రతి ఫంక్షన్లో బంగారం తళుకుమని మెరవాల్సిందే.

భారతీయులు బంగారానికి ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి వేడుకుల నుంచి ప్రతి ఫంక్షన్లో బంగారం తళుకుమని మెరవాల్సిందే. ఎలాంటి శుభకార్యం నిర్వహించిన బంగారంతోనే ముడిపడి ఉంటుంది. ప్రతిఒక్కరూ మెరిసేపోయే బంగారంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని బంగారం ఆదుకుంటుంది.
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్

బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కొందరు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటారు. అలాంటి బంగారాన్ని ఇంట్లో ఉంచితే దొంగల భయం. అందుకే చాలామంది తమ బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుంటారు. అక్కడే తమ బంగారం సేఫ్ గా ఉంటుందని భావిస్తారు. ఇంతకీ బ్యాంకు లౌకర్లలో భద్రపరిచిన మీ బంగారు భద్రమేనా? అంటే.. అవును అనే సమాధానం ఎక్కువగా వస్తుంది. ఇంటితో పోలిస్తే.. బ్యాంకుల్లోనే బంగారానికి మరింత భద్రత ఉంటుందని గట్టిగా నమ్ముతారు. 

ఐదేళ్లలో బ్యాంకుల్లో రూ.235 కోట్లు దోపిడీ :
అయితే బ్యాంకు లాకర్లు పూర్తిగా సురక్షితమైనవని చెప్పలేం. ఎందుకంటే.. బ్యాంకులో కూడా ఎన్నో దోపిడీలు జరుగుతుంటాయి. గత కొన్ని ఏళ్లలో ఇండియాలోని బ్యాంకుల్లో దోపిడీ, దొంగతనాలు జరిగిన ఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఇండియాలోని బ్యాంకుల్లో రూ.235 కోట్లు దోపిడీకి గురయ్యాయి. ఎంతో కష్టపడి సంపాదించి కూడబెట్టిన మీ విలువైన బంగారం, డబ్బు ఎంతవరకూ బ్యాంకు లాకర్లలో భద్రమో మీరే ఓసారి ఆలోచించుకోండి. ఇంట్లో భద్రత లేదు.. మరి బ్యాంకుల్లో కూడా భద్రత లేదంటే.. ఎక్కడ దాచుకోవాలి బంగారాన్ని అనే సందేహం ప్రతిఒక్కరిలోనూ వస్తుంది. బ్యాంకు లాకర్లు కూడా సురక్షితం కాకుంటే ఎలా బంగారం దొంగలపాలు కాకుండా కాపాడుకోవడానికి సరైన మార్గమే లేదా? అని టెన్షన్ పడుతున్నారా?  

బ్యాంకు లాకర్ పాలసీ ఉందిగా : 
డోంట్ వర్రీ.. బ్యాంకు లాకర్లలో బంగారానికి సురక్షితమైన మార్గం ఉంది. అదే.. బ్యాంకు లాకర్ ఇన్యూరెన్స్ పాలసీ. ఇదేంటీ.. బంగారానికి ఇన్యూరెన్స్ ఏంటీ అనుకుంటున్నారా? అవును. బ్యాంక్ ఇన్యూరెన్స్ పాలసీనే బంగారానికి కచ్చితమైన పరిష్కారం. బ్యాంకు లాకర్లలో దాచిన మీ విలువైన వస్తువులకు పాలసీ తీసుకోండి. ఈ పాలసీ ఎంచుకోవడం ద్వారా పాలసీ దారులకు జ్యుయెలరీ, ఇతర విలువైన వస్తువులపై కవరేజీ అందిస్తోంది. బ్యాంకు లాకర్లలో పెట్టిన ముఖ్యమైన డాక్యుమెంట్లపై కూడా పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ ప్రాసెస్ ఎంతో ఈజీ కూడా. ఇందుకు స్పెషిఫిక్ లిమిట్ పై సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం ఉంటుంది. ఈ పాలసీని బ్యాంకుల్లో గ్రూపు పాలసీగానూ లేదా రిటైల్ పాలసీగానూ రెండూ పొందవచ్చు. 

ఈ పాలసీలో ఏం కవర్ అవుతాయంటే? 
*
బ్యాంకు లాకర్లలో ప్రమాదవశాత్తూ (మీ విలువైన వస్తువులు, బంగారం) డ్యామేజ్ లేదా కోల్పోయినప్పుడు 
* బ్యాంకు సిబ్బందిపై అపనమ్మకం, దోపిడీ, బెదిరించి విలువైన వస్తువులను నిలుపుట
* బ్యాంకుల్లో ఉగ్ర దాడులు వంటి ఘటనలు జరిగిన సమయంలో 
* షేర్, స్టాక్ సర్టిఫికేట్లు, డిపాజిట్ రిస్పిట్స్, టైటిల్ డీడ్స్, రాతప్రతులు, ప్లాన్స్, పాస్ పోర్ట్, ఇన్యూరెన్స్ పాలసీ, పర్సనల్ రికార్డ్స్, సర్టిఫికేట్లు, వ్యక్తిగత రికార్డులు కవర్ అవుతాయి. 
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా