Barley Water : వేసవిలో వేడిని తగ్గించి, శక్తిని అందించే బార్లీ వాటర్!

పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ నీళ్లు తాగించటం మంచిది. హృద్రోగాలను దరి చేరనివ్వవు.

Barley Water : వేసవిలో వేడిని తగ్గించి, శక్తిని అందించే బార్లీ వాటర్!

Barley Water

Barley Water : వేసవి కాలంలో మండే ఉష్ణోగ్రతలు శరీరంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు పెరగటంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుండి త‌ప్పించుకునేందుకు, శ‌రీరాన్ని చల్లబ‌రుచుకునేందుకు ర‌కర‌కాల శీత‌ల పానీయాల‌ను తాగేస్తుంటారు. కూల్ డ్రింక్స్ వంటి వాటిని తాగటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నఅవుతాయి. అయితే పోషకాలు అందించటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గించేందుకు వేసవిలో బార్లీ నీరు తాగటం ఎంతో మంచిది. బార్లీ గింజలు వేసవిలో సహజసిద్ధమైన ఔషధంలా పనిచేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. బార్లీ నీటిని తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మూత్రాశ‌యం శుభ్రంగా మారుతుంది. క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి.. వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు భార్లీ నీటి ద్వారా శరీరానికి అందుతాయి.

పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ నీళ్లు తాగించటం మంచిది. హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు.. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది. బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలుపుకొని తాగితే రుచితోపాటు శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకొని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది. బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోయి శ‌రీరం చల్లగా మారుతుంది.