Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!

ఒక స్పూన్ తులసి రసంలో కొంచెం తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే, బొంగురు పోయిన గొంతు, సాఫీగా ఉంటుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.

Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!

Tulasi

Basil : తులసి మొక్కను హిందూ ఆచార సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంటి పెరట్లో తులసి కోటను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వివిధ రకాల రుగ్మతలను తొలగించటంలో తులసి ఆకులు ఉపయోగపడతాయి. తులసితో టొమాటో బాసిల్ సలాడ్, చికెన్ బాసిల్ స్టిర్ ఫ్రై, బాసిల్ పాస్తా, పెస్తో చికెన్ టార్ట్ , చికెన్ సలాడ్, బాసిల్ సూప్, బాసిల్ ఐస్ క్రీమ్ వంటి వాటిని తయారు చేస్తారు.

అల్లం, తులసి ఆకులతో చేసిన టీ తాగితే జలుబు, దగ్గు తగిపోతాయి. తులసి ఆకులతో తయారైన సాస్ ని బ్రెడ్, శాండ్ విచ్, పాస్తాల్లో వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తులసి ఆకులు మానసిక వత్తిడిని తగ్గిస్తాయి. చర్మసమస్యలను పోగొడతాయి. టొమాటో సూప్ లో నాలుగు తులసి ఆకులు వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో ఆరోగ్యానికి తులసి ఆకులు బాగా ఉపకరిస్తాయి. వేసవిలో తులసి ఆకులు రోజూ గుప్పెడు నమిలితే దుమ్ము దూళి నుండి శ్వాసనాళాలు శుభ్రపరచటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

ఒక స్పూన్ తులసి రసంలో కొంచెం తేనెను కలిపి ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే, బొంగురు పోయిన గొంతు, సాఫీగా ఉంటుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. తులసి రసం తమలపాకు రసం కలిపి దానికి చిటికెడు పంచదార చేర్చి ఉదయం సాయంత్రం రెండేసి స్పూన్ల చొప్పున తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. తులసి వేర్లు ఎండబెట్టి పొడుం చేసి నిల్వ ఉంచుకుని, తేలు కుట్టినచోట అద్దితే, నొప్పి తగ్గుతుంది. రక్తంలోని కొలెస్టరాలని తగ్గించే గుణం తులసికి ఉంది.