Summer Safety For Children : వేసవి కాలంలో మీ పిల్లలు జాగ్రత్త !

వేసవి కాలంలో వండిన పదార్థాలు ఎండవేడికి త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టుకుని  తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంతులు, విరేచనాలకు కారణం కావచ్చు. ఫ్రిజ్ ల్లో కూలింగ్ నీరు తాగడం వల్ల పిల్లలు వెంటనే జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి.

Summer Safety For Children : వేసవి కాలంలో మీ పిల్లలు జాగ్రత్త !

Be careful of your children during summer!

Summer Safety For Children : మనలో చాలా మందికి వేసవి అంటే పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడి దుమ్ముతో కూడిన గాలి, తేమ, వడదెబ్బ, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు , ఇతర వ్యాధులు. వీటన్నింటి మధ్య, పిల్లలను చూసుకోవడం ఒక సవాలుగా మారుతుంది. సాధారణంగా పిల్లలు వేసవి కాలంలోనే చాలా చురుకుగా ఉంటారు. ఎందుకంటే పాఠశాలలకు సెలవు దినాలు కావటంతో చదువులు, హోంవర్కులకు విరామం కలుగుతుంది. ఈ సమయాన్ని పిల్లలు ఆటపాటలకు ఉపయోగిస్తారు. స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు.

READ ALSO : Precautions During Summer : వేసవి కాలంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించటం మంచిది !

ఇలాంటి సమయంలోనే వేడి, సూర్యుని ప్రతాపం, దుమ్ము మరియు కాలుష్యం వంటి అన్ని రకాల బాహ్య మూలకాలకు పిల్లలు బహిర్గతం అవుతారు. వేసవిలో పిల్లల సంరక్షణ కోసం కొన్ని సులభమైన చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి. వేసవి కాలంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎండవేడి కారణంగా చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

రోజంతా హైడ్రేట్ గా ;

అధిక వేడి వారిని అనారోగ్యం పాలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు పెరగటం, నీరసం, వడబెబ్బకు గురికావటం వంటివి చోటు చేసుకుంటాయి. పిల్లలు రోజంతా హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. ఏదో ఒకవిధంగా పిల్లలు ఆటలు మరియు అన్ని రకాల అవుట్‌డోర్ యాక్టివిటీల పట్ల ఆసక్తితో నీరును పెద్దగా సేవించరు. గంటల తరబడి దాహంతో ఉంటారు. దాహం చేసినప్పుడు నీరు సేవించటం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిని అలాగే ఉంచుతుంది. హైడ్రేట్ గా ఉండాలంటే కొబ్బరి నీరు, పండ్ల రసాలు, సిట్రస్ పండ్లు మరియు మజ్జిగ, నిమ్మకాయ నీరు మరియు పండ్ల స్మూతీస్ వంటి సులభంగా లభించే ఇతర ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయవచ్చు.

శీతలపానీయాలు వద్దు ;

అధిక ఉష్ణోగ్రత, కలుషితమైన నీరు, ఆహారం, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాలు… ఇలా కారణం ఏదైనా వేసవి సమయంలో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటలతో శరీరంలో నీరు త్వరగా ఆవిరై  వడదెబ్బకు దారితీస్తుంది. ఎండలో ఎక్కువసేపు గడిపితే అధిక చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.

READ ALSO : Summer Health Care : వేసవి కాలం వచ్చేసింది.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమే!

ఎండసమయంలో బయటకు అనుమతించకండి ;

ఉదయం, సాయంత్రం ఎండలేని సమయాల్లోనే పిల్లలను బయటికి అనుమతించటం శ్రేయస్కరం. ఎండ సమయంలో పిల్లలకి కథలు చెప్తూ, రైమ్స్,పాటలు పాడిస్తూ, పుస్తకాలు చదివిస్తూ, బొమ్మలు వేయిస్తూ, ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడుకునేలా చూసుకోవాలి. కొబ్బరినీళ్లు, బార్లీ, సబ్జా, సగ్గుబియ్యం వంటి ద్రవాలు తాగించాలి. సీజనల్ ఫ్రూట్స్, అన్నీ రకాల ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి. పిల్లలకి రెండు పూటలు తప్పక గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నట్టయితే తడిబట్టతో తుడుస్తుండాలి.

ఇంట్లో చల్లని వాతావరణం ఉండేలా చూడాలి ;

ఇంట్లోకి వేడిగాలి నేరుగా చొచ్చుకు రాకుండా చుట్టూ మ్యాట్ లు వేలాడదీయాలి. ఇవి పూర్తిగా తడి ఆరిపోకుండా చూసుకోవడం వల్ల గదులన్నీ చల్లని వాతావరాణాన్నికలిగి ఉంటాయి. పిల్లలకు పలుచటి, మెత్తటి కాటన్‌ దుస్తులు వేయాలి. బయటికి వెళ్లాల్సివస్తే గొడుగు, టోపీ,తప్పకుండా ధరించాలి. దాహంతో సంబంధం లేకుండా మంచి నీరు వారికి అందించాలి. సాధ్యమైనంత వరకు నిలువ ఆహారం జోలికి పోకుండా తాజా ఆహారం మాత్రమే పెట్టాలి. వేసవి కాలంలో బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత నిమ్మకాయ రసం, ఖర్జూరం పిల్లలకు ఇస్తే జీర్ణశక్తి పెరుగుతుంది.

READ ALSO : Fridge Water : వేసవి కాలంలో ఫ్రిజ్ వాటర్ తో దాహం తీర్చుకుంటున్నారా! అయితే జాగ్రత్త?

తాజా ఆహారాన్ని అందించాలి ;

వేసవి కాలంలో వండిన పదార్థాలు ఎండవేడికి త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిజ్ లో పెట్టుకుని  తింటే, అధిక చల్లని పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా పిల్లల్లో వాంతులు, విరేచనాలకు కారణం కావచ్చు. ఫ్రిజ్ ల్లో కూలింగ్ నీరు తాగడం వల్ల పిల్లలు వెంటనే జబ్బుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఎండాకాలం వచ్చే వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. కళ్ళకలక, గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, అతిసారా, కామెర్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఈ వ్యాధుల విషయంలో అప్రమత్తగా ఉండాలి. పిల్లలు డీహైడ్రేషన్ కి లోనయినట్టు అనిపించినా ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగించాలి.

చెరువుల,నదుల వద్దకు ఈతకు వెళుతుంటే ;

చెరువులు.. బావులకు సరదాగా ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో పిల్లలను నీటికి దూరంగా ఉంచాలి. విద్యార్ధులు స్నేహితులతో కలసి సరదాగా ఈతకు వెళ్తుంటారు. కొంత మంది పాత బావుల్లో కూడ ఈతకు వెళతారు. ఇలాంటి సమయంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు ఈత కోట్టే ముందు పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులను నీటికి దూరంగా ఉంచడమే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Summer Super Food : వేసవి కాలంలో శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసే పెరుగు !

వాహానాలతో రోడ్లపైకి ;

పిల్లలకు కార్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాటిని నడిపేందుకు రోడ్డెక్కి ప్రమాదాల భారిన పడాల్సి వస్తుంది. అవసమైతే పెద్దల సమక్షంలో నడిపైలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఏది ఏమైనా వేసవి సెలవుల్లో చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.