High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో జాగ్రత్త!

కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారిలో నిద్రిస్తున్న సమయంలో కాళ్లలో తీవ్రమైన తిమ్మిర్లు వస్తాయి. ధమనులను దెబ్బతీసే అధిక కొలెస్ట్రాల్ లెవల్స్‌ పెరిగాయన్నదానికి ఇదొక సంకేతం. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రవాహం వేగం తగ్గుతుంది.

High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో జాగ్రత్త!

High Cholesterol

High Cholesterol : ఇటీవల కాలంలో అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటివి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ముప్పు ముంచుకొస్తుంది. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు బయటకు కనిపించ కుండా సైలెంట్ గా మనిషిని కిల్ చేస్తాయి. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ గుర్తించడానికి కొన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. అయితే అధిక బరువు, శరీరంలో ఫ్యాట్ ను బట్టి కొలెస్ట్రాల్ లెవల్స్ ను అంచనా వేయవచ్చు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నాయని గుర్తించాలి.

కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారిలో నిద్రిస్తున్న సమయంలో కాళ్లలో తీవ్రమైన తిమ్మిర్లు వస్తాయి. ధమనులను దెబ్బతీసే అధిక కొలెస్ట్రాల్ లెవల్స్‌ పెరిగాయన్నదానికి ఇదొక సంకేతం. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రవాహం వేగం తగ్గుతుంది. దీని వల్ల శరీర చర్మం రంగును మారే అవకాశాలు ఉంటాయి. రక్త ప్రవాహం తగ్గడం వల్ల కణాలకు సరైన పోషణ లభించకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్న వారిలో కాళ్ల ధమనులు మూసుకుపోయినప్పుడు, ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగినంత మొత్తంలో శరీర దిగువ భాగానికి చేరదు. దీంతో కాలు బరువుగా అనిపిస్తుంది. అవయవాలలో మంట, నొప్పి వస్తుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలు , కాళ్లు చల్లగా అనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్ధితి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది.

మెడ, దవడ, కడుపు, వెనుక భాగంలో నొప్పి వస్తున్నట్లు అనిపిస్తే అది కొలెస్ట్రాల్‌ సమస్యవల్లే కావచ్చు. రక్తంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు కళ్లపై పసుపు మచ్చలు కనిపిస్తాయి. విపరీతంగా చెమటలు పట్టడం వంటి సమస్య ఉన్న వారిలో కూడా అధిక కొలెస్ట్రాల్ పెరగటానికి ఇదొక సూచన. గుండెకు రక్త ప్రసరణ తక్కువగా ఉన్న సమయంలో ఇలా చెమటలు పడుతుంటాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.