Seven Steps : పెళ్లిలో ఏడడుగుల సప్తపది ఎందుకంటే?

బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలు పట్టుకుని వరుడు ఏడడుగులు నడుస్తాడు.

Seven Steps : పెళ్లిలో ఏడడుగుల సప్తపది ఎందుకంటే?

Saptha Padhi

Seven Steps : పెళ్లి అంటే నూరేళ్ళ పంట. జన్మకి ఒక సారి జరిగే ఈ వివాహ క్రతువు అగ్నిసాక్షిగా జరుగుతుంది. రెండు మనసులు, రెండు కుటుంబాలు జీవితకాలం కలిసుండే ఓ మహత్తరమైన ఘట్టం. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే  ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. ఈ ఆచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలు పట్టుకుని వరుడు ఏడడుగులు నడుస్తాడు. దీనినే సప్తపదిగా పిలుస్తారు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపది యొక్క ముఖ్య ఉద్దేశం.

ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు అంటూ వేసే తొలి అడుగు విష్ణువు ఇద్దరినీ ఒక్కటిగా చేయుగాక అని అర్ధం. ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు అంటూ వేసే రెండో అడుగు ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక అని, త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు అంటే వేసే మూడో అడుగు వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించాలని, చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు అంటూ వేసే నాలుగో అడుగు మనకు విష్ణువు ఆనందాన్నికలిగించాలని, పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటూ వేసే ఐదోఅడుగు విష్ణుమూర్తి పశుసంపదను కలిగించాలని, షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు ఆరోఅడుగు ఆరు రుతువులు మనకు సుఖసంతోషాలను ఇవ్వాలని, సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు అంటే వేసే ఏడో అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహం ఇవ్వాలని ఇలా సప్తపదితో దేవాదిదేవుడైన విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకుంటారు వధుమరులు.

ఏడడుగులకు పురాణగాధలు క్లుప్తంగా చెప్పిన సందేశం ఏటంటే మొదటి అడుగు అన్న వృద్ధికి, రెండవ అడుగు బల వృద్ధికి, మూడవ అడుగు ధన వృద్ధికి, నాలుగవ అడుగు సుఖ వృద్ధికి, ఐదవ అడుగు ప్రజా పాలనకు, ఆరవ అడుగు దాంపత్య జీవితానికి, ఏడవ అడుగు సంతాన సమృద్ధి కి వేస్తారు. ఈ ఏడడుగుల ఘట్టం పెళ్లి వేడుకలో చాలా ముఖ్యమైనది.