Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట

ఆల్కహాల్ తాగొద్దు.. మద్యం సేవిస్తే ప్రాణాలకే ముప్పు.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ కొటేషన్లు సినిమా హాల్స్ తో సహా ఎక్కడపడితే అక్కడ చూస్తూనే ఉంటాం. అయితే ఇందులోనూ ఒక తిరకాసు ఉంది. ఏదైనా హద్దు మించితేనే ప్రమాదం కానీ,

Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట

Beers

Drinking Beer: ఆల్కహాల్ తాగొద్దు.. మద్యం సేవిస్తే ప్రాణాలకే ముప్పు.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ కొటేషన్లు సినిమా హాల్స్ తో సహా ఎక్కడపడితే అక్కడ చూస్తూనే ఉంటాం. అయితే ఇందులోనూ ఒక తిరకాసు ఉంది. ఏదైనా హద్దు మించితేనే ప్రమాదం కానీ, రోజూ కొంత మోతాదులో మాత్రమే తీసుకుంటే ఇబ్బంది లేదంట. పైగా బీర్‌ను రోజుకు కొంచెంగా తీసుకుంటే పేగులకు మంచి జరుగుతుందట.

పోర్చుగల్ లోని పోర్టో నగరంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ నిర్వహించిన స్టడీలో ఇదే విషయం వెల్లడైంది.

“బీర్ తాగడం వల్ల పేగుల్లో ఉండే మైక్రోబయోటా అనే మంచి బ్యాక్టీరియా మెరుగుదలకు దోహదం చేస్తుంది. ఇది ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల వంటి చాలా సాధారణ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకుంటుంది” అని CINTESIS సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: రోజుకో బీర్.. ఆరోగ్యానికి మంచిదేనట..! లాభం ఇదే

స్టడీ సమయంలో, 23 నుండి 58 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పురుషులు 4 వారాల పాటు ఆల్కహాల్ ఉన్న బీర్‌ను, ఆల్కహాల్ లేని బీర్‌ను ప్రతిరోజూ 330 మిల్లీలీటర్ల బీర్ తాగారు.

పరిశోధన ద్వారా పొందిన ఫలితాలు బీర్ వినియోగం “బరువు, కొవ్వు ద్రవ్యరాశిని పెంచకుండా, ప్రేగు మైక్రోబయోటా అనే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది” అని సూచించింది.

బీర్ తాగడం వల్ల గ్లూకోజ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి “కార్డియోమెటబాలిక్ బయోమార్కర్స్‌కు పెద్దగా అంతరాయం కలగదు” అని ప్రకటన పేర్కొంది.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఇటీవల ప్రచురించిన అధ్యయనం, గట్ ఆరోగ్యంపై బీర్ వల్ల చేకూరే ప్రయోజనం ఆల్కహాల్ కంటెంట్ తో సంబంధం లేకుండా ఉందని నిరూపితమైంది.