Kidney Disease : కిడ్నీ వ్యాధికి ఆయుర్వేద ఔషదంతో ప్రయోజనం… పరిశోధనల్లో వెల్లడి

ఈ ఔషదంతో రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, మూత్రపిండాల్లో తలెత్తే విషతుల్యతను తగ్గించడం,యాంటీఆక్సిడెంట్లను విడుదల చేయడం కిడ్నీల పనితీరును పెంచుతున్నట్లు గుర్తించారు. సీరం క్రియాటి

Kidney Disease : కిడ్నీ వ్యాధికి ఆయుర్వేద ఔషదంతో ప్రయోజనం… పరిశోధనల్లో వెల్లడి

Kidney (1)

Kidney Disease : ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపే ప్రక్రియలో కిడ్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయటం ద్వారా మూత్ర పిండాలు శరీరంలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బిపీ, ఎలక్ట్రోలైట్ స్ధాయిలను నియంత్రిస్తాయి. కిడ్నీల పనితీరు సక్రమంగా లేకపోతే మావనదేహానికి పెనుముప్పు ముంచుకువచ్చే అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీ వ్యాధులకు పలు రకాల మూలికలతో కూడిన ఆయుర్వేద ఔషధం ‘నీరి-కేఎఫ్‌టీ’తో వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం కలుగుతుందని తాజా పరిశోధనలో తేలింది.

ఇది దీర్ఘకాల కిడ్నీ రుగ్మత ఉద్ధృతిని నెమ్మదింపచేయడమే కాకుండా ఈ అవయవం మునుపటిలా ఆరోగ్యంగా పనిచేసేందుకు వీలు కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధన వివరాలు సౌదీ జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. భారత్‌కు చెందిన ఏఐఎంఐఎల్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ నీరి-కేఎఫ్‌టీని ఔషదాన్ని ఉత్పత్తి చేస్తోంది. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సీకేడీ) అనే దీర్ఘకాల రుగ్మతపై దీని ప్రభావాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ మందు.. ఆక్సిడేటివ్, ఇన్‌ఫ్లమేటరీ ఒత్తిడి వల్ల కణాలు మృతి చెందడాన్ని నిలువరిస్తుందని గుర్తించారు.

ఈ ఔషదంతో రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, మూత్రపిండాల్లో తలెత్తే విషతుల్యతను తగ్గించడం,యాంటీఆక్సిడెంట్లను విడుదల చేయడం కిడ్నీల పనితీరును పెంచుతున్నట్లు గుర్తించారు. సీరం క్రియాటినిన్, బ్లడ్‌ యూరియా, సీరం యూరిక్‌ యాసిడ్‌ వంటి వాటి స్థాయినీ ఈ ఔషధం తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఔషద వినియోగం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవన్న విషయం పరీక్షల్లో తేలింది.

మూత్రపిండాలు పనిచేయక, తరచూ డయాలసిస్‌ చేయించుకునేవారికి ప్రత్యామ్నాయ చికిత్సగా నీరి-కేఎఫ్‌టీని సూచించవచ్చని పేర్కొన్నారు. ఈ ఔషధంలో ఉన్న 20కిపైగా మూలికల వల్ల ఈ ప్రభావం కలుగుతోందని ఏఐఎంఐఎల్‌ ఎండీ కె.కె.శర్మ తెలిపారు. వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధులను నయం చేసే గుణాలు ఈ ఔషదంలో కలిగి ఉన్నాయి. వీటివల్ల మూత్రపిండాలకే కాక కాలేయానికీ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కిడ్నీల విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. కిడ్నీలు చెడిపోయే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. తలనొప్పి, ఏకాగ్రత తగ్గటం, లాంటి సమస్యలతోపాటు, ముఖం, కాళ్ళు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను ముందే పసిగట్టి మెరుగైన చికిత్స తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.