Coffee Powder : కాఫీ పొడితో ప్రయోజనాలు ఎన్నో!

కాఫీ వాసన తో క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు. దోమలు సమస్య సైతం కాఫీ పొడి ద్వారా తొలగించుకోవచ్చు. కాఫీ పొడితో పొగవేయటం ద్వారా ఆ పొగను దోమలు భరించలేక దూరంగా వెళ్ళిపోతాయి.

Coffee Powder : కాఫీ పొడితో ప్రయోజనాలు ఎన్నో!

Cofee Powder (1) (2)

Coffee Powder : చాలా మందికి నిద్రలేచింది ఆలస్యం కాఫీ తాగటంతోనే రోజు మొదలవుతుంది. ఇంట్లోనే కాఫీ గింజలతో కాఫీ పొడిని తయారు చేసుకుని రుచికరమైన, మంచి సువాసన కలిగిన కాఫీని తయారు చేసుకుంటుంటారు. అయితే మార్కెట్లో లభించే కాఫీ పొడి లో కొన్ని రకాల రసాయనాలు కలిసి ఉండటం వల్లనే చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించరు. మనం రోజువారి ఉపయోగించే కాఫీ పొడితో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే వాటి గురించి చాలా మందికి తెలియదు.

కాఫీ పొడితో చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాఫీ పొడిలోని పోషకాలు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టుని ఆరోగ్యంగా మారుస్తాయి. మొటిమలను తొలగించటంతోపాటు రక్తప్రసరణ మెరుగుపరచటంలో కాఫీపొడి తోడ్పడుతుంది. కాఫీ పొడికి చుట్టుపక్కల వాసనలను గ్రహించే గుణం ఉంటుంది. గదిలో కానీ, ఫ్రిజ్‌లో కానీ భరించలేని వాసనలు వస్తుంటే అక్కడ కాపీ పొడిని ఉంచండి. కొంత సేపటి తర్వాత ఆ వాసనలు తొలగిపోతాయి. చర్మ సౌందర్యం కోసం కాఫీ పొడితో ఇంటిలోనే సహజసిద్ధమైన మంచి ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితం పొందవచ్చు.

కాఫీ వాసన తో క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు. దోమలు సమస్య సైతం కాఫీ పొడి ద్వారా తొలగించుకోవచ్చు. కాఫీ పొడితో పొగవేయటం ద్వారా ఆ పొగను దోమలు భరించలేక దూరంగా వెళ్ళిపోతాయి. కాఫీ పొడిని ముఖంపై అప్లై చేయటం ద్వారా చర్మం బిగుతుగా తయారవుతుంది. కళ్ల చుట్టూ వాపులు తగ్గుతాయి. కాఫీ పొడి పేస్ట్ ను తలకు పట్టించటం ద్వారా జుట్టు సిల్కీగా మెరుస్తుంది. ఇంట్లో వంట పాత్రలపై జిడ్డు మరకలు, కాలిన మసి మరకలు పోవాలంటే కాఫీ పొడి వేసి బాగా రుద్దాలి. ఇలా చేయటం వల్ల అవి తళతళా మెరుస్తాయి. మాంసం రుచిగా ఉండాలంటే దానికి కాఫీ పొడిని అప్లై చేయాలి. కాఫీలోని యాసిడ్ మాంసానికి మంచి రుచిని కలిగిస్తుంది. కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే కాఫీలోని డైఫినాల్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.