Juices : మహిళల అందాన్ని పెంచటంతోపాటు, ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ లు ఇవే!
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు సహాయపడుతుంది. ఈ నేచురల్ డ్రింక్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

Juices : ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారంతో కూడిన ఆహారంతో అందాన్ని పెంచుకోవచ్చు. మహిళలు సాధారణంగా తమ అందం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. చర్మం, జుట్టు సంరక్షకు అందుబాటులో ఉన్న పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. ఇందుకోసం కోసం ఖరీదైన, రసాయన ఆధారిత ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం లేదు. పోషకాల ద్వారా కూడా కూడా జుట్టు, చర్మానికి ప్రకాశవంతం చేసుకోవచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. క్యారెట్ జ్యూస్ ; క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే క్యారెట్‌ను ఉడికించి, వేయించి తీసుకోవడం కంటే. జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. మహిళలు పచ్చి క్యారెట్ తో జ్యూస్ తయారు చేసుకుని ప్రతి రోజు తీసుకుంటే.అద్భుతమైన ఆరోగ్యానికి ప్రయోజనాలు లభిస్తాయి. రెగ్యులర్‌గా క్యారెట్ జ్యూస్ తాగితే.అందులో ఉండే విటమిన్ కె, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎముకలను, కండరాలను దృఢంగా మారుస్తాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గు ముఖం పడతాయి.చర్మం ఎల్లప్పుడు యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.
2. ఫ్రూట్ బ్లెండ్ జ్యూస్ ; పండ్లు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. పండ్లు శరీరానికి, మెదడుకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది గుండెపోటు వంటి ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారిస్తుంది. దీనితో పాటు, ఇది కళ్ళు, చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది.
3. పాల కూర జ్యూస్ ; చర్మ సమస్యలకు పాలకూర ఎంతో మేలు చేస్తుంది. ఒక రకంగాచెప్పాలంటే ఇది దివ్యౌషదం. వృద్ధప్య ప్రక్రియను దరిచేరనివ్వదు. చర్మంపై ముడతలు పోగొడుతుంది. మచ్చలను తొలగించి అందాన్ని పెంచుతుంది.
2. కొబ్బరి నీరు ; కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు సహాయపడుతుంది. ఈ నేచురల్ డ్రింక్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మానికి కొబ్బరి నీరు చేసే మేలు అంతా ఇంతా కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
3. కూరగాయల రసం ; కొన్ని రకాల కూరగాయలతో తయారు చేసిన జ్యూస్‌లు తాగడం అలవాటు చేసుకోండి. దీంతో మీకు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, జింక్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. దీంతో అధిక రక్తపోటు, రక్తహీనత, చర్మ సమస్యలు వంటి సమస్యలు తొలగిపోతాయి.