Stress : ఈ ఐదు రకాల ఒత్తిడుల విషయంలో జాగ్రత్త!

కొద్దిపాటి సమయస్పూర్తితో ఈ ఒత్తిడులను సులభంగా అధిగమించవచ్చు. జీవనశైలి, అలవాట్లను ఆరోగ్యవంతంగా మార్చుకోవాలి. ప్రవర్తను అమోదయోగ్యంగా చేసుకోవాలి.

Stress : ఈ ఐదు రకాల ఒత్తిడుల విషయంలో జాగ్రత్త!

Stress

Stress : ఆరోగ్యానికి ఒత్తిడి చేసే కీడు అంతా ఇంతాకాదనే చెప్పాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గేలా చేయటంలో ఒత్తిడి ప్రభావం అధికంగా ఉంటుంది. శరీరంలో దీర్ఘకాలిక ఒత్తిడిని తట్టుకోలేరు. ఒత్తిడి ఎంతగా పెరుగుతుందో రోగనిరోధక శక్తి అంతాగా తగ్గుతుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. మనిషిని ఒత్తిడి గురి చేసే అంశాలు ప్రధానంగా ఐదు రకాలుగా ఉంటాయి.

1. శరీరక ఒత్తిడి; ఇది జీవనశైలితో వస్తుంది. అంటే మన ఆహారం , వ్యాయామం, విశ్రాంతి, ఆల్కహాల్ , తీసుకోవటం, పొగతాగటం, మన చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఈ తరహా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

2.ఉద్వేగపరమైన ఒత్తిడి ; ఇది మన రోజువారీ జీవితంలో సంతృప్తి చెందని అనుభూతి నుండి, మానసికంగా అయ్యే గాయాల వల్ల ఏర్పడుతుంది.

3.మానసిక మైన ఒత్తిడి ; ఇది మనం ఆలోచించే తీరు, మన జీవితంలో పాటించే విలువలు, నమ్మకాలు, మన ప్రవర్తన, మన ఊహాల వల్ల ఏర్పడే ఒత్తిడి.

4. మన చుట్టూ ఉన్న వ్యవస్ధల కారణంగా మనపైపడే ఒత్తిడి. మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన ఒత్తిడులన్నీ ఈ కోవకే చెందుతాయి.

5. ఆత్మసంబంధమైన ఒత్తిడులు, మనుగడ, మన జీవిత లక్ష్యాలు, మతపరమైన నమ్మకాల కారణంగా ఎదురయ్యే ఒత్తిళ్లు.

కొద్దిపాటి సమయస్పూర్తితో ఈ ఒత్తిడులను సులభంగా అధిగమించవచ్చు. జీవనశైలి, అలవాట్లను ఆరోగ్యవంతంగా మార్చుకోవాలి. ప్రవర్తను అమోదయోగ్యంగా చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారంతా ఆనందించేలా మన వ్యక్తిత్వాన్ని మార్పు చేసుకుంటే మన ఒత్తిడులన్నీ తొలగిపోతాయి. దీంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఒత్తిడి నుండి స్వస్ధత చేకూరుతుంది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.