Brain : ఈ అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయ్ జాగ్రత్త!

ఈ రెండు అలవాట్ల వల్ల మెదడుతోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆల్కహాల్ ను విపరీతంగా తాగడం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. ఎక్కువగా తాగేవారి మెదడుకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. దీంతో మెదడు కుంచించుకుపోతుంది.

Brain : ఈ అలవాట్లు మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయ్ జాగ్రత్త!

serious effect on the brain

Brain : మెదకుడు ఎలాంటి హాని కలుగకుండా చూసుకున్నపుడే మన శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. అపుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఒక వయసుకు వచ్చే సరికి మెదడు పనిచేసే సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా చిత్తవైకల్యం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల కూడా మెదడు ముందుగానే దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మెదడులో30 నుంచి 40 ఏండ్లు వచ్చే సరికి దాని పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. 60 లోకి అడుగుపెట్టినప్పుడు ఇది మరింత వేగం అవుతుంది. దీనికి కొన్ని రకాల అలవాట్లు కూడా కారణమౌతాయి. అవే మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అలాంటి అలవాట్లను మానుకోవటం ద్వారా దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఉదయం అల్పాహారం మానుకోవటం ; బిజీ లైఫ్ కారణంగా చాలా మందికి ఇంట్లో పనులను చేసుకోవడానికే సరిపడా టైం ఉండదు. దీంతో బ్రేక్ ఫాస్ ను ఎగ్గొడతారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ ను చేయకపోవడం వల్ల శరీరంతో పాటు మెదడును కూడా దెబ్బతీస్తుంది.

ఆలస్యంగా నిద్రపోవడం : రాత్రి త్వరగా నిద్రపోకుండా అర్ధరాత్రి వరకు మేల్కోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఫోన్ , టీవీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూసుకుంటూ తెల్లవార్లూ మేల్కొనటం వల్ల ఆప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. ముఖ్యంగా అలాంటి వారిలో మెదడు పనితీరులో అనేక మార్పులు వస్తాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ ఆరోగ్యమే కాదు మెదడు కూడా దెబ్బతింటుంది.

ఆల్కహాల్, ధూమపానం ; ఈ రెండు అలవాట్ల వల్ల మెదడుతోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆల్కహాల్ ను విపరీతంగా తాగడం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. ఎక్కువగా తాగేవారి మెదడుకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. దీంతో మెదడు కుంచించుకుపోతుంది. ధూమపానం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. వీటికి దూరంగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మెదడు పనితీరును కాపాడుకోవచ్చు.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం ; చక్కెర మెదడు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. చక్కెర ను తగిన మోతాదులోనే ఉపయోగించటం శ్రేయస్కరం

ఇంటర్నెట్ వాడకం ; విపరీతమైన ఇంటర్నెట్ వాడకం వల్ల కూడా మెదడు దెబ్బతింటుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఇంటర్నెట్ ను వాడటం వల్ల మెదడు కణాలు నాశనం కావడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ అలవాటును మానుకోండి. అవసరానికి మించి ఎక్కువగా ఉపయోగిస్తే తీవ్రమైన నష్టాల్ని చవిచూడాల్సి వస్తుంది.

ఆలస్యంగా నిద్రలేవడం ; అలస్యంగా నిద్రలేచే అలవాటును మానుకోవాలి. ఈ అలవాటు వల్ల శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా నష్టం జరుగుతుంది. ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.