Bigger Gift – Better Dinner: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి విందు

పెళ్లి జరిగింది అని తెలిసినా.. జరుగుతుందని అని విన్నా.. ఒక ప్రశ్న మాత్రం కచ్చితంగా వినిపిస్తుంది. విందు ఏర్పాట్లు ఎలా జరిగాయని.. ఏమేం వెరైటీలు ఉన్నాయని.

Bigger Gift – Better Dinner: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి విందు

Wedding Reception

Bigger Gift – Better Dinner: పెళ్లి జరిగింది అని తెలిసినా.. జరుగుతుందని అని విన్నా.. ఒక ప్రశ్న మాత్రం కచ్చితంగా వినిపిస్తుంది. విందు ఏర్పాట్లు ఎలా జరిగాయని.. ఏమేం వెరైటీలు ఉన్నాయని. తమ స్థోమత చూపించుకోవడం కోసం వీలైనంత వరకూ ఖర్చు పెట్టి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ జరిగింది దానికి విరుద్ధం. యథేచ్ఛగా ఖర్చుపెట్టేసి విందు భోజనం వడ్డించలేదు. దేని లెక్క దానిదే అంటున్నారు ఈ కపుల్.

రెడిట్‌లో ‘బిగ్గర్‌ క్యాష్‌ గిఫ్ట్‌.. బెటర్‌ డిన్నర్‌’ అనే క్యాప్షన్‌తో వైరలవుతోన్న ఈ నోట్‌లో తమ వివాహ బహుమతి కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలియజేయమని అతిథులను అడిగారు. గిఫ్ట్‌ కోసం చేసే ఖర్చును బట్టి వారికి డిన్నర్‌లో ఏం ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామంటూ పేర్కొన్నారు. పైగా ఇందులో క్యాటగిరీల వారీగా విడగొట్టారు కూడా.

తమ వివాహానికి హాజరయ్యే అతిథులను 4 వర్గాలుగా విభజించారు. ఈ గ్రూప్‌లకు ‘ప్రేమపూర్వక బహుమతి’, ‘బంగారు బహుమతి’, ‘వెండి బహుమతి’, ‘ప్లాటినం బహుమతి’ అని వేర్వేరు పేర్లు పెట్టారు.

పెళ్లికి వచ్చిన అతిథులు తెచ్చే బహుమతి విలువ 250 డాలర్లు అయితే ‘ప్రేమపూర్వక బహుమతి’.. వారికిచ్చే విందులో రోస్ట్ చికెన్‌ లేదా చేపను వడ్డిస్తారు.

అతిథులు కొనుగోలు చేసే బహుమతుల విలువ 251-500 డాలర్ల మధ్య ఉంటే, ‘సిల్వర్ గిఫ్ట్’ కేటగిరీ డిన్నర్‌లో భాగంగా మొదటి కేటగిరీలో వంటలు లేదా ముక్కలు చేసిన స్టీక్, సాల్మన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

బహుమతుల విలువ 501-1000 డాలర్ల మధ్య ఉంటే ‘బంగారు బహుమతి’ వారికి డిన్నర్‌లో మొదటి, రెండో కేటగిరీ వంటకాలు కలిపి వడ్డిస్తారు. అవి కాదనుకుంటే ఫైలెట్ మిగ్నాన్, ఎండ్రకాయల తోకలను ఎంచుకోవచ్చు.

బహుమతుల విలువ 1000 -2500 డాలర్ల లోపు ఉంటే అది ‘ప్లాటినం గిఫ్ట్’ వారికి డిన్నర్‌లో మొదటి, రెండో, మూడో కేటగిరీ కింద వంటకాలు వడ్డిస్తారు. వద్దనుకుంటే ఎండ్రకాయతో పాటు సావనీర్ షాంపైన్ గోబ్లెట్‌ని కూడా వడ్డిస్తారు.