Bike Accident: సూపర్ బైక్ క్రాష్‌లో ప్రాణాలు కాపాడేదెంటో తెలుసా..

మోటార్ సైకిల్స్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ టెక్నిక్ లు కచ్చితంగా వాడాలి. అందులో సూపర్ బైక్ ల విషయంలో ఇంకా ఎక్కువ ఉండాలి.

Bike Accident: సూపర్ బైక్ క్రాష్‌లో ప్రాణాలు కాపాడేదెంటో తెలుసా..

Bike Accident

Bike Accident: సూపర్ బైక్‌లపై అందరిదీ ఒకటే ప్రశ్న. మెరుపు వేగంతో దూసుకెళ్లగలవని తెలుసు కానీ, సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అందరిలోనూ ప్రొటెక్షన్ గురించే ప్రశ్న. ఒకవేళ అంత వేగంగా వెళ్తున్న టైంలో బైక్ లో టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగితే ప్రాణాలు కాపాడుకోవడం ఎలా. అదృష్ఠవశాత్తు సాయి తేజ్ హెల్మెట్ ధరించి ఉండటంతో కాస్త సేఫ్ అయ్యారు.

ప్రమాద తీవ్రతకు స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఎమర్జెన్సీ స్టాఫ్ అలర్ట్ అయి సకాలంలో హాస్పిటల్ కు తరలించారు.

మోటార్ సైకిల్స్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ టెక్నిక్ లు కచ్చితంగా వాడాలి. అందులో సూపర్ బైక్ ల విషయంలో ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇవి సాధారణ బైక్ ల కంటే బరువు ఎక్కువగా ఉండటం, మెషీన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటాయి.

ముందుగా హెల్మెట్ కచ్చితంగా ఉండాలి. అది కూడా ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో ఉండేవే. రెండో విషయం గ్లౌజులు. ఎందుకంటే దాదాపు పడిపోయినప్పుడు ఆపుకోవడానికి చేతులతోనే ప్రయత్నిస్తాం. గ్లౌజులకు చేతి కీళ్లను ప్రొటెక్ట్ చేసే లేయర్ ఉంటే యాక్సిడెంట్ తీవ్రతను తగ్గిస్తుంది.

రైడింగ్ కోసమే డిజైన్ చేసిన జాకెట్లు ధరించాలి. వాటికి భుజాలు, మోచేతులకు గార్డులు ప్రత్యేక ప్రొటెక్షన్ ఉంటుంది. కొన్నింటికి అయితే ఛాతీ, వెన్నెముకకు సపోర్టింగ్ కూడా ఉంటాయి. కాకపోతే వీటిని సపరేట్ గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మోకాలికి గార్డులు ఉండటం వల్ల స్క్రాచింగ్, ప్రాక్చర్లు కాకుండా రక్షణ కల్పించి ఎముకలు విరగకుండా కాపాడతాయి.

మందపాటి లేయర్ల కూడిన బూట్లు బొటనవేలి నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా రోడ్ గ్రిప్ ను కూడా. సూపర్ బైక్ ల విషయంలోనే కాదు.. మామూలు బైక్ రైడింగ్ చేసే వాళ్లు కూడా సేఫ్టీ టిప్స్ పాటిస్తే ఇంకా మంచిది.