Biological E Vaccine : అతి తక్కువ ధరకే బయోలాజికల్ ఈ-టీకా

బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ అతి తక్కువ ధరకే రానున్నట్లు తెలుస్తోంది. టీకాకు సంబంధించిన మూడోదశ ట్రయల్స్‌ కూడా మరో కొన్ని రోజుల్లోనే స్టార్ట్‌ కానున్నాయి.

Biological E Vaccine : అతి తక్కువ ధరకే బయోలాజికల్ ఈ-టీకా

Biological E Vaccine May Be One Of The ‘affordable’ Ones

Biological E Vaccine : బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ అతి తక్కువ ధరకే రానున్నట్లు తెలుస్తోంది. టీకాకు సంబంధించిన మూడోదశ ట్రయల్స్‌ కూడా మరో కొన్ని రోజుల్లోనే స్టార్ట్‌ కానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్యన బయోలాజికల్ ఈ లిమిటెడ్- బీఈ ఇప్పటికే తన కరోనా టీకా సబ్యూనిట్ వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

దీని మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి మూడు వారం ముందే ఆమోదం లభించింది. నవంబర్ 2020లోనే బయోలాజికల్ ఈ తన కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినియకల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ రెండు దశల్లోనూ సమర్థవంతమైన ఫలితాలను రాబట్టింది.

ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో బీఈ చేపట్టనుంది. బీఈ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వచ్చే ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం బయోలాజకిల్ ఈకి ఉండడం ప్రస్తుత పరిస్థితులో భారత్‌కు ప్లస్‌గా మారనుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.