Body image: సగం కంటే ఎక్కువ మంది మగాళ్లే శరీరం మీద బెంగ పెట్టేసుకుంటున్నారట!!

సగం మంది మగాళ్లు వాళ్ల బాడీ ఇమేజ్ గురించి బాధపడుతూ మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని ఓ కొత్త స్టడీ ...

Body image: సగం కంటే ఎక్కువ మంది మగాళ్లే శరీరం మీద బెంగ పెట్టేసుకుంటున్నారట!!

Body Image

Body image: సగం మంది మగాళ్లు వాళ్ల బాడీ ఇమేజ్ గురించి బాధపడుతూ మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని ఓ కొత్త స్టడీ చెప్తుంది. 16 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 48శాతం మంది ఇదే సమస్యపై పోరాడుతున్నారని అందులో తేలింది. సూసైడ్ ప్రివెన్షన్ ఛారిటీ కాంపైన్ చేసిన ఓ స్టడీలో వివరాలిలా ఉన్నాయి.

2వేల మంది పాల్గొన్న ఈ స్టడీలో 58 శాతం మంది మహమ్మారి కారణంగా తాము శరీరంపై అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కేవలం 26శాతం మంది మాత్రమే సంతోషంగా ఉండగా, 21శాతం మంది కంఫర్ట్ లేకుండా ఉన్నామని… ఆ ఫీలింగ్ వేరే వాళ్లతో చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్తున్నారు.

అందులో జార్జ్ అనే వ్యక్తి.. నా అనుభవం ప్రకారం నా మానసిక ఆరోగ్యం జీవితంలోని ప్రతి అంశంపై ఆధారపడి ఉంటుంది. అందులో బాడీ ఇమేజ్ కూడా ఓ భాగమే. చాలా కాలంగా నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్నాను. నాలో ఏ లోపం లేకపోయినా కూడా. ఎందుకంటే నా బాడీలో ఏదో తేడాగా కనిపిస్తుందనుకుంటున్నా. అందుకే కాన్ఫిడెంట్ లేక కంఫర్ట్ కోల్పోతున్నా.

కంపేరిజన్ కల్చర్ – సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఒకరితో ఒకరు పోల్చుకోవడం ఎక్కువైంది.

మరొక వ్యక్తి మాట్లాడుతూ.. నవంబరు 2016లో డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లు ఉన్నట్లు గుర్తించాను. అలా బాధపడటం తొలి సారిగా రగ్బీ ఆడుతున్నప్పుడే తెలిసింది. ఇతరులతో పోల్చుకుని నాకు కండలు లేవని నా మీద నాకే ద్వేషం మొదలైంది.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఒంటరిగా ఉండటం వల్ల ఫిట్ నెస్ కరువైన వారు, ఒంటరితనంతో నిండిపోయిన వారు మానసికంగా కుంగిపోతూ బాడీ ఇమేజ్ గురించి కాస్త ఎక్కువగానే బాధపడుతున్నారు.