Breastfeeding : బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిపాలే మంచి పోషకం!

అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి శిశువులను రక్షించడంలో తల్లిపాలు సహాయపడుతుంది. పెద్దయ్యాక కూడా వారికి రక్షణను అందిస్తూనే ఉంటుంది. తల్లిపాలు తాగని పిల్లల కంటే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ కి దారితీసే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

Breastfeeding : బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిపాలే మంచి పోషకం!

breastfeeding

Breastfeeding : బిడ్డకు తల్లిపాలు సరైన ఆహారం. సరైన మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదడగానికి తల్లి పాల నుంచే పోషకాలు అందుతాయి. శిశువు యొక్క అభివృద్ధి చెందుతున్న కడుపు, ప్రేగులు మరియు ఇతర శరీర వ్యవస్థలకు తల్లిపాలు ఎంతో మేలు కలిగిస్తుంది. బిడ్డకు 6 నెలల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కనీసం 1 నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు ఘనమైన ఆహారాలతో పాటుగా తల్లిపాలు ఇవ్వటం మంచిదని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన పోషకాలు ;

డబ్బాపాలతో పోలిస్తే, తల్లిపాలలోని పోషకాలు బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడతాయి. వీటిలో చక్కెర (కార్బోహైడ్రేట్) మరియు ప్రోటీన్ ఉన్నాయి. తల్లిపాలలో శిశువు మెదడు పెరుగుదల మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఉత్తమమైన పోషకాలు ఉన్నాయి. తల్లిపాలు తాగే పిల్లలు పెద్దయ్యాక తెలివితేటల పరీక్షలలో మెరుగ్గా పనిచేస్తారని అధ్యయనాల్లో కనుగొన్నారు. తల్లిపాలు తాగే శిశువు కళ్లు మెరుగ్గా పనిచేస్తాయి. ఇది తల్లిపాలలో కొన్ని రకాల కొవ్వుల వల్ల వస్తుంది.

అంటువ్యాధులను నివారించడం ;

తల్లిపాలలో అనేక వ్యాధిపోరాట కారకాలు ఉన్నాయి. అవి తేలికపాటి నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు నిరోధించడంలో సహాయపడతాయి. తల్లిపాలు తాగే పిల్లలకు జీర్ణ, ఊపిరితిత్తులు ,చెవి ఇన్ఫెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. చిన్నారిని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడటానికి తల్లి పాలు ఎంతో ముఖ్యం. చనుబాలలో యాంటీబాడీలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడతాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్థమా, అలర్జీలు తక్కువగా ఉంటాయి.

ఇతర పరిస్థితులను నివారించడం ;

అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి శిశువులను రక్షించడంలో తల్లిపాలు సహాయపడుతుంది. పెద్దయ్యాక కూడా వారికి రక్షణను అందిస్తూనే ఉంటుంది. తల్లిపాలు తాగని పిల్లల కంటే తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ కి దారితీసే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలెర్జీలకు సంబంధించిన ఆస్తమా, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ. డబ్బాపాలు, ఇతర ఫార్ములాలు వాడిన శిశువులకు అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. లుకేమియా అభివృద్ధి చెందే తక్కువ ప్రమాదం. పెరిగే కొద్దీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మధుమేహం,ఊబకాయం వంటివి దరిచేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

అదే సమయంలో తల్లిపాలు ఇచ్చే మహిళలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. బిడ్డలకుపాలు ఇచ్చే తల్లులు గర్భధారణ సమయంలో పెరిగిన బరువును కోల్పోయే అవకాశం ఉంది. జీవితంలో రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ , మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.