Love with Alien: ‘ఏలియన్లు కిడ్నాప్ చేశాయి.. వాటితో ప్రేమలో పడ్డా’

ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి.. తమ ప్రేమను, అభిమానాన్ని పంచే వ్యక్తి కోసం టీనేజ్ లో ఎదురుచూడటం మామూలే. అలా నిజంగా వేరే ప్రపంచంలో ఉన్న వారినే ప్రేమిస్తా.. డేటింగ్ చేస్తా అంటే ఎలా..

Love with Alien: ‘ఏలియన్లు కిడ్నాప్ చేశాయి.. వాటితో ప్రేమలో పడ్డా’

Aliens Love1

Love with Alien: ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి.. తమ ప్రేమను, అభిమానాన్ని పంచే వ్యక్తి కోసం టీనేజ్ లో ఎదురుచూడటం మామూలే. అలా నిజంగా వేరే ప్రపంచంలో ఉన్న వారినే ప్రేమిస్తా.. డేటింగ్ చేస్తా అంటే ఎలా.. కానీ, అలాగే జరిగింది. తాను ఏలియన్‌తో ప్రేమలో పడ్డానని.. డేటింగ్ కు రెడీ అంటోంది ఈ బ్రిటీష్ యువతి.

ఆండ్రోమెడా గ్యాలక్సీకి చెందిన ఏలియన్ తో తాను ప్రేమలో పడిందట. అబ్బీ బెలాను ఓ ఏలియన్ గ్రూప్ గుర్తు తెలియని ఓ ఎగిరే వాహనంలో వచ్చి కిడ్నాప్ చేశారట. ఈ నెల ఆరంభంలో జరిగిన ఘటనలో తనకు ఒక ఏలియన్ పరిచయమైందట. ఈ భూమ్మీద మనుషుల కంటే అదెంతో బెటర్ అని చెప్తుంది. అంతేకాకుండా ఏలియన్ లవర్ తో నెక్స్ట్ డేట్ కు కూడా రెడీగా ఉన్నానని అంటోంది.

భూమ్మీద మనుషులతో విసిగిపోయాను. నేను ఆన్ లైన్లో జోక్ చేస్తూ ఓ కామెంట్ చేశా.. నన్ను కిడ్నాప్ చేయడానికి ఏలియన్ కావాలని. అప్పటి నుంచి పగలూ రాత్రి లేకుండా కలలు కంటూ ఉండేదాన్ని. ఆ రోజు రాత్రి ఒక వాయీస్ వినిపించింది. రోజూ ఉండే స్పాట్ లోనే వెయిట్ చెయ్ అని.. ఆ తర్వాతి రోజు సాయంత్రం నా కిటికీ పక్కనే నిద్రపోతున్నట్లుగా కూర్చొని ఉన్నా. అప్పుడే కాంతివంతమైన పచ్చ రంగులో లైట్ కనిపించింది. అదే నన్ను UFO వరకూ తీసుకుని పోయిందని మీడియాకు వెల్లడించింది ఆ యువతి.

ఆమె కథనం ప్రకారం.. ఆమె కలిసిన ఏలియన్లు మనుషుల్లాగే ఉన్నారు. కాకపోతే పొడుగ్గా సన్నగా ఉన్నారట. రిపోర్టుల ప్రకారం.. ఏలియన్లతో తన మీటింగ్ కేవలం 20నిమిషాలు మాత్రమే జరిగిందట. ఆ తర్వాత తనని సేఫ్ గా ఇంటికి చేర్చేశారట.

మరో బ్రిటిష్ యువతి పౌలా స్మిత్ కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైందట. తన బెడ్ రూం నుంచి దాదాపు 50సార్లుకు పైగా ఏలియన్లు కిడ్నాప్ చేశాయట. ఓ కప్పులాంటి వాహనంలో అంచుల్లో లైట్లు వెలుగుతుండగా.. ప్రయాణించానని చెప్పింది.

ఆ ప్రదేశంలో పరిగెత్తడానికి ప్రయత్నించా. కాకపోతే అది ఇసుకలా అనిపించింది. మునిగిపోతానేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత అంతా చీకటిగా మారిపోయింది. ఆ సమయంలో నేను నాలుగు గంటల పాటు కనిపించకుండా పోయానని నా ఫ్యామిలీ చెప్తుంటుంది. అది ఎలా జరిగిందో నాకైతే అస్సలు గుర్తుండదు. అలా జరుగుతూనే ఉంటుంది. నా బెడ్ రూం విండో నుంచి కిడ్నాప్ కు గురవుతూనే ఉంటాను’ అని స్మిత్ డైలీ స్టార్స్ అనే ఇంగ్లీష్ మీడియాకు చెప్పింది.