Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!

కుడి మోచేయి ఆసరాతో పక్కకు పడుకోవాలి.కుడి కాలు ముందుకు, ఎడమకాలు వెనుకకు ఉంచాలి.చేయి మీద బరువు ఉంచి, నడుమును గాల్లోకి లేపాలి.ఇలా చేస్తున్నప్పుడు మోచేయి, పాదాలు మాత్రమే నేలను తాకి ఉండాలి.

Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!

Exercise

Belly Fat : మన జీవనశైలిలో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది.సాధారణంగా అధిక బరువు ఉండే వారికి పొట్ట దగ్గర కొవ్వు అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి అనారోగ్యాలు దరిచేరతాయి. దీన్ని కరిగించేందుకు చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుల్ని కరిగించుకొని నాజూకైన నడుమును సొంతం చేసుకునేందుకు కొన్ని యోగాసనాలు ఎంతగానో దోహదపడతాయి. పరిమితంగా తింటూ, క్రమశిక్షణతో ఈ యోగాసనాలు చేస్తే పొట్ట దగ్గర కొవ్వును సులభంగానే కరిగించుకోవచ్చు.

పశ్చిమోత్తాసనం ; ఈ ఆసనం సుఖాసనం, పద్మాసనం వేసిన తర్వాత చేయవచ్చు. నేలమీద కాళ్లు చాపి కూర్చోవాలి. ముందుకు వంగి రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. వంగుతున్నప్పుడే తలను కూడా వంచుతూ, మోకాళ్లకు ఆనించాలి.ఈ భంగిమలో కనీసం ఒక నిమిషం పాటు ఉండాలి. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. ఆ ప్రదేశంలోని కొవ్వు కరగడంతో పాటు కటి కండరాలు బలపడతాయి. సులభంగా బరువు తగ్గేందుకు ఈ ఆసనం దోహదపడుతుంది. ఈ ఆసనం వేయటం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. మోకాలి కీళ్లు బలోపేతమౌతాయి.

భుజాంగాసనం : బోర్లా పడుకోవాలి. చేతులను నేలపై ఉంచాలి. చేతుల మీద బరువు మోపుతూ నడుము పైభాగాన్ని గాల్లోకి లేపాలి. ఈ భంగిమలో 25 సెకన్లు ఉండి తిరిగి క్రితం భంగిమలోకి రావాలి. పెద్దప్రేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం బయటకు పంపుతుంది. ఈ ఆసనంతో కటి దగ్గరి కండరాలు బలపడతాయి. పైకడుపు, పొత్తి కడుపు దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అదే సమయంలో చేతుల మీద బరువు ఉంచడం వల్ల భుజాలు, చేతుల్లోని కండరాలు కూడా బలపడతాయి. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది.

వశిష్టాసనం ; కుడి మోచేయి ఆసరాతో పక్కకు పడుకోవాలి.కుడి కాలు ముందుకు, ఎడమకాలు వెనుకకు ఉంచాలి.చేయి మీద బరువు ఉంచి, నడుమును గాల్లోకి లేపాలి.ఇలా చేస్తున్నప్పుడు మోచేయి, పాదాలు మాత్రమే నేలను తాకి ఉండాలి. రెండో చేయి నేలమీద ఉంచిన చేతికి సమాంతరంగా గాల్లో లేపి ఉంచాలి. ఈ ఆసనం కడుపు, వెన్ను, పిరుదులలోని కండరాలకు బలాన్నిస్తుంది. ఆ ప్రదేశాల్లోని కొవ్వు కరుగుతుంది. కొవ్వు కరిగి శరీర సమతుల్యత పెరగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.

ఉష్ట్రారాసనం ; మోకాళ్ల మీద కూర్చుని, నడుము పైభాగాన్ని వెనక్కి విల్లులా వంచాలి. చేతులను వెనక్కి వంచి, కాలి మడమలను పట్టుకోవాలి. కాళ్ల మధ్య అడుగు గ్యాప్ ఉండాలి. వెనక్కి వంగేటప్పుడు నడుము పైభాగంతో పాటు చేతులను కూడా వెనక్కి తీసుకెళ్లాలి. ఆ ఆసనంతో పొట్ట ప్రదేశంలోని కండరాలు సాగుతాయి. పొట్ట బిగుతుగా తయారవుతుంది. పిరుదుల మీద కూడా ఒత్తిడి పడుతుంది. తద్వారా కొవ్వు కరుగుతుంది. శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వును సులభంగా కరిగించుకునేందుకు ఈ యోగాసనం ఉపయోగపడుతుంది.