Diabetes : సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించవచ్చా?..

ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

10TV Telugu News

Diabetes : ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిపై దాడిచేస్తోంది మధుమేహం. చిన్నా, పెద్దా అందరూ ఈ వ్యాధి బాధితులుగా మారుతున్నారు. జీవనశైలి మార్పుతో చాలామంది డయాబెటిక్‌ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నాయి. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహం బారిన పడతారని ఒక ప్రాథమిక అంచనా. అయితే సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

జన్యుపరమైన కారణాలవల్ల అనేక కుటుంబాల్లో అందరికీ మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడం వంటివీ ఈ వ్యాధిని ఆహ్వానించే అంశాలే. శరీర బరువును అదుపులో ఉంచడం, పొగాకు వాడకాన్ని నిలిపివేయడం టైప్‌-2 డయాబెటిస్‌ రాకుండా నిరోధించడానికి మార్గాలు.

ఊబకాయం, నియంత్రణ లేని జీవనవిధానం మధుమేహ బాధితులకు రిస్క్​ను పెంచుతాయి. రెగ్యూలర్​గా వ్యాయామం చేయడం, బరువును చెక్​చేసుకోవడం వల్ల టైప్​-2 డయాబెటిస్​ను పెరగకుండా నియంత్రించవచ్చు. భోజనవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అధిక బరువును నియంత్రణలో పెట్టవచ్చు.

పోషకాలతో కూడిన ఫుడ్​ మెనూ ఫాలో కావాలి. తృణధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి కరెక్ట్​గా ఉంటుంది. ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. లేదంటే అది టైప్​-2 మధుమేహాన్ని మరింత పెంచడంతోపాటు గుండెపోటుకు దారితీస్తుంది.మెడిటేషన్, యోగా క్రమంగా చేయడం ద్వారా ఒత్తిడి, షుగర్ నియంత్రలో ఉంటుంది.

పిల్లల్లోనే కాదు- పెద్దల్లో సైతం శారీరక శ్రమ తగ్గడంతోపాటు అధిక కెలొరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మధుమేహం బారిన పడటానికి దారితీస్తోంది. చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోరాదు. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఫుడ్ మెనూలో భాగం చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది. వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు.. వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది.

ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపదార్థాలను కలిగి సోడియం కొలెస్ట్రాల్ లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినవచ్చు ఇది మధుమేహాన్ని నియంత్రిస్థుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.

×