Breathing Exercises : శ్వాస వ్యాయామాలతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చా?

ఒత్తిడి సాధారణంగా కండరాల్లో, మరీ ముఖ్యంగా మెడ, భుజాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. రోజుకు 15 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే డయాబెటిస్‌ను కంట్రోల్ చేయటంతోపాటు, బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది.

Breathing Exercises : శ్వాస వ్యాయామాలతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చా?

Breathing Exercises : ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలు. డయాబెటిస్ అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం. ఇది వస్తే జీవితకాలం మందులు వేసుకోవాల్సిందే. అయితే జీవన శైలి మార్చుకుంటే డయాబెటిస్ సమస్యను దూరం చేయవచ్చంటున్నారు నిపుణులు. అధిక మద్యపాన సేవనం, పొగ తాగడం కూడా డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ఒత్తిడి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ఉన్న మీ అనారోగ్యాన్ని మరింత కుంగదీయడంతో పాటు కొత్తగా అనేక వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుంది. మందులు వేసుకుంటున్నంత మాత్రాన ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకోకపోతే, డయాబెటిస్ నియంత్రణ కష్టమౌతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివన్నీ డయాబెటిస్‌తో ముడిపడి ఉంటాయి.

డయాబెటస్ సమస్యను నియంత్రించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ చేస్తేఎండార్ఫిన్ లు విడుదలవుతాయి. ప్రాణాయామ, మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తే ఒత్తిడి సమస్యను అదిగమించవచ్చు. దీని వల్ల అడ్రినలిన్, నాన్-అడ్రినలిన్, కార్టికల్ వంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఇన్సులిన్ తగ్గిపోయినప్పుడు జరిగే చర్యను నిరోధిస్తాయి. శ్వాసవ్యాయామాలు చేస్తే డీప్ రిలాక్సేషన్ అనుభూతి పొందవచ్చు.

ఒత్తిడి సాధారణంగా కండరాల్లో, మరీ ముఖ్యంగా మెడ, భుజాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. రోజుకు 15 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే డయాబెటిస్‌ను కంట్రోల్ చేయటంతోపాటు, బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి, కాలుష్య కారకాల నుండి రక్షించడానికి డీప్ బ్రీతింగ్ సహాయపడుతుందని చెప్పారు. 10 నిమిషాల దీర్ఘ శ్వాస, యోగా మీ ఊపిరితిత్తులను బలోపేతం కావటంతోపాటుగా, నాసికా మార్గాన్ని శుభ్రపరచడానికి, కాలుష్య కారకాలతో పోరాడటానికి సహాయపడుతుంది.

పిల్లలు, వృద్ధులు నాణ్యత లేని గాలిని పీల్చుకుని ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంట్లోనే ఉండటం మంచిది. కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పీక్ అవర్స్‌లో బయటకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదు. బహిరంగ క్రీడా కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఉదయం, సాయంత్రం నడక వంటి కొన్ని శ్వాస వ్యాయామాలు వాయు కాలుష్య కారకాల విష ప్రభావాలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

అంతేకాకుండా 30 ఏళ్లు పైబడిన వారందరూ తరచుగా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనలు సలహాలు పాటించటం వల్ల మధుమేహం సమస్య ఉన్నప్పటికీ జీవితాన్ని సాఫీగా సాగించేందుకు అవకాశం ఉంటుంది.