Uncontrolled Blood Sugar : డయాబెటిక్ రోగులకు బ్లడ్ షుగర్స్ స్ధాయి అదుపుతప్పితే కిడ్నీలు దెబ్బతింటాయా?

మధుమేహం ఉన్నవారికి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వారి మూత్రపిండాలను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. మొదట, మూత్రంలో అధిక ప్రోటీన్ స్థాయిలు పోవటం వంటి సంకేతాలు కనిపిస్తాయి.

Uncontrolled Blood Sugar : డయాబెటిక్ రోగులకు బ్లడ్ షుగర్స్ స్ధాయి అదుపుతప్పితే కిడ్నీలు దెబ్బతింటాయా?

diabetic patients have kidney damage

Uncontrolled Blood Sugar : మధుమేహం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తటం కారణంగా వచ్చే వ్యాధి. కాలక్రమేణా, అధిక రక్త చక్కెర కలిగి ఉండటం వలన కళ్ళు, నరాలు, గుండె, రక్త నాళాలు మరియు మూత్రపిండాలు దెబ్బతింటాయి. బ్లడ్ షుగర్ నియంత్రణ వల్ల ఈ నష్టం జరగకుండా ఆపడానికి సహాయపడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. మూత్రపిండాలు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలోని ఫ్లూయిడ్స్‌, ఎలక్ట్రోలైట్‌లు, యాసిడ్‌-బేస్‌ బ్యాలెన్స్‌ను నియంత్రిస్తాయి. ఎండోక్రైన్‌ ఫంక్షన్ల ద్వారా ఇవి హిమోగ్లోబిన్‌ స్థాయిని, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇన్ని రకాల పనులు చేసే మూత్రపిండాల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటంలో తగిన శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.

మధుమేహం మూత్రపిండాలపై ప్రభావం ;

మధుమేహం కారణంగా రక్తంలో అధిక చక్కెరను కలిగి ఉండటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఎక్కువ నష్టం జరిగినప్పుడు, మూత్రపిండాలు తక్కువ పనితీరును కలిగి ఉంటాయి. వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనినే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి మధుమేహం ప్రధాన కారణం. రక్తంలో చక్కెరను నియంత్రించడం వల్ల మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇది మూత్రపిండాల వ్యాధి నెమ్మదించేలా చేయటంతోపాటు కొంతకాలం ఆపడానికి సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారికి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వారి మూత్రపిండాలను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. మొదట, మూత్రంలో అధిక ప్రోటీన్ స్థాయిలు పోవటం వంటి సంకేతాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలను కనిపించే అంత తీవ్రంగా మూత్రపిండాలు దెబ్బతినడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, ముఖంలో నీరు చేరటం, అలసట, తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.