Potatoes : బంగాళ దుంపలు తింటే బరువు పెరుగుతారా?

తియ్యటి బంగాళదుంపలు కొవ్వు కణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఆలుగడ్డలలోని ప్రొటినేజ్‌ ఇన్‌హిబిటర్‌ 2 అనే ప్రొటీన్‌ ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల ఆలుగడ్డలను కొద్దిమొత్తంలో తిన్నా చాలు ఎక్కువసేపు ఆకలి కలగకుండా చూస్తుంది.

Potatoes : బంగాళ దుంపలు తింటే బరువు పెరుగుతారా?

Potatoes

Potatoes : బంగాళ దుంపలు వీటిని ఆలుగడ్డలని కూడా పిలుస్తారు. చాలామంది వీటిని ఇష్టపడతారు. ఎక్కువగా తినేందుకు మాత్రం భయపడతారు. వీటివల్ల ఊబకాయం వస్తుందని చాలా మంది భావిస్తారు. బంగాళదుంపలు పిండి పదార్థాలు, అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువ. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కూడా ఎక్కువే. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బంగాళాదుంపలో లభించే ఫైబర్‌ను ‘రెసిస్టెంట్ స్టార్చ్’ అంటారు, ఇది కరిగే మరియు కరగని ఫైబర్ రెండింటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ స్టార్చ్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. మలబద్ధకం మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారంగా దోహదం చేస్తుంది.

ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌-సి, బి6, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు కూడా అధికమే. విటమిన్‌ బి6 మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఈ విటమిన్‌ వల్ల సెరటోనిన్‌, డోపమైన్‌ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి చక్కగా నిద్ర పడుతుంది. వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బంగాళాదుంపలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, అంటే అవి సెల్ డ్యామేజ్‌ను కలిగించకుండా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. మీ శరీరానికి తగినంత పొటాషియం లభించనప్పుడు, అది సోడియంను నిలుపుకుంటుంది, ఇది రక్తపోటు స్థాయిలను పెంచుతుంది.

తియ్యటి బంగాళదుంపలు కొవ్వు కణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఆలుగడ్డలలోని ప్రొటినేజ్‌ ఇన్‌హిబిటర్‌ 2 అనే ప్రొటీన్‌ ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల ఆలుగడ్డలను కొద్దిమొత్తంలో తిన్నా చాలు ఎక్కువసేపు ఆకలి కలగకుండా చూస్తుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

ఆలూలోని ఐరన్‌, క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి. ఆలుగడ్డ సౌందర్య పోషణలోనూ ఉపయోగపడతాయి. ఆలుగడ్డ ముక్కలతో ముఖానికి మసాజ్‌ చేస్తే నల్లమచ్చలు, ముడతలు తగ్గుతాయి.