Keto Diet : కీటో డైట్ తో బరువు తగ్గొచ్చా?..

కీటోసిస్ విధానంలో శరీరంలో తగినంత గ్లూకోజ్ లేకపోతే కీటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వును పదార్ధాలను కరిగించుకుంటుంది.

Keto Diet : కీటో డైట్ తో బరువు తగ్గొచ్చా?..

Keto Diet

Keto Diet : కఠినమైన ఆహార నియమాలతో కాకుండా సులభంగా బరువు తగ్గే మార్గాల్లో కిటో డైట్ ప్లాన్ ఒకటి. ఈ మధ్యకాలంలో ఈ కీటో డైట్ విధానానికి బాగా ప్రాచుర్యం లభిస్తుంది. బరువు తగ్గించుకోవటం కష్టంగా బావిస్తున్నవారు, బరువు తగ్గేందుకు వివిధ మార్గాలు అనుసరించి విసిగిపోయిన వారు ప్రస్తుతం ఈ కీటోస్ విధానంలో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజులో 20 నుండి 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే తీసుకుని శరీరాన్ని కటోసిస్ స్ధితికి తీసుకురావటాన్ని కీటోజెనిక్ డైట్ అంటారు.

కిటో డైట్ తీసుకునే సమయంలో శరీరం తనలోని కొవ్వును కరిగించి కావల్సిన ఎనర్జీని సమకూర్చుకుంటుంది. శరీరం కీటోసిస్ దశకు చేరాలంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వు తీసుకోవటాన్ని తగ్గించటంతోపాటు, ప్రొటీన్ ఇన్ టెక్ ను పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో శరీరం నిల్వ చేసిన కొవ్వుతో పాటు తీసుకునే కొవ్వును కరిగించుకుంటుంది. ఆసమయంలోనే శరీరం ప్రొటీన్ ను గ్లూకోజ్ గా మార్చి శక్తిని పొందుతుంది.

కీటో డైట్ లో వివిధ రకాల విధానాలున్నాయి. వాటిలో మొదటిది స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్. దీనికి సంబంధించి కార్బోహైడ్రేట్స్ 10శాతం, ప్రొటీన్ 20శాతం, 70శాతం కొవ్వు అహారాన్ని తీసుకుంటారు. రెండవది టార్గెటెడ్ కీటోజెనిక్ డైట్. ఈ విధానంలో వర్కౌట్స్ చేస్తూ కార్బోహైడ్రేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మూడవది హైప్రోటీన్ కీటోజెనిక్ డైట్. ఈ విధానంలో ఎక్కువ ప్రొటీన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. 60శాతం కొవ్వు, 35శాతం ప్రోటీన్, 5శాతం పిండి పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి.

కీటోసిస్ విధానంలో శరీరంలో తగినంత గ్లూకోజ్ లేకపోతే కీటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వును పదార్ధాలను కరిగించుకుంటుంది. కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవటంతో కాలేయం కొవ్వును కరిగించుకుని శక్తిగా మార్చుకుంటుంది. ఈ శక్తి కిటోన్ కణాల రూపంలో ఉంటుంది. కీటోజెనిక్ ఆహారం వాస్తవానికి మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో భాగంగా రూపుదాల్చింది.

కాన్సర్ , అల్జీమర్స్, ఎపిలెప్సీ, పార్కిన్ సన్స్, బ్రెయిన్ సంబంధిత వ్యాదులతో బాధపడుతున్నవారికి కీటోజెనిక్ డైట్ ఎంతో మేలు చేస్తుంది. కొవ్వు పదార్ధాలు అధికంగా ఉన్న మాంసం, చేపలు, నూనె పదార్ధాలు, జున్ను, గుడ్లు, చీజ్, నట్స్, సీడ్స్, అవకాడో, టమోటోలు, ఆనియన్ష్, పెప్పర్, హెర్బ్స్, స్పైసెస్ వంటి వాటిని తీసుకోవాలి. అదే క్రమంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. సోడా, బంగాళ దుంపలు, క్యారెట్స్, సలాడ్స్, తేనె, ప్రాసెస్డ్ అయిల్స్, బీర్, వైన్, మిక్స్ డ్ డ్రింక్స్, బీన్స్, రైస్, ఫ్రూట్స్, బఠాణి, ఐస్ క్రీమ్, కేక్ వంటివాటిని తీసుకోకూడదు.

కీటోసిస్ ప్రక్రియను కొనసాగించే వారిలో కొన్ని సైడె ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే అవి తాత్కాలికమైనవి. తలనొప్పి, నోటి దుర్వాసన, అలసట, వికారం వంటి లక్షణాలు ఈ ప్రక్రియ అనుసరిస్తున్న సందర్భంలో ఎదురు కావచ్చు. ఈ విధానం మంచిదేనని పలువురు నిపుణులు సూచిస్తున్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో దీనిని అనుసరించటం వల్ల మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. శరీరంలో గుండె, కిడ్నీ,షుగర్ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కీటో డైట్ ను అనుసరించకపోవటమే ఉత్తమం.