Bitter Gourd : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే కాకరకాయ? షుగర్ కు కాకరకాయకు ఉన్న సంబంధం ఏంటంటే?

బరువు తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు కాకరకాయ ను క్రమం తప్పకుండా వాడటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలో ఉండే చక్కెర ను శక్తి గా మార్చడానికి తోడ్పడతాయి.

Bitter Gourd : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే కాకరకాయ? షుగర్ కు కాకరకాయకు ఉన్న సంబంధం ఏంటంటే?

Bitter Gourd

Bitter Gourd : చేదుగా ఉండే కాకర కాయను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే కాకర కాయను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 100 గ్రాముల కాకరకాయలో 90% నీటి శాతం ఉంటుంది 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మాంసకృత్తులు 1.4 గ్రామ్స్ ఉంటాయి. కొవ్వు పదార్థాలు ఉండవు. ఇందులో ముఖ్యంగా పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ ఇందులో లభిస్తుంది.

కాక‌య కాయ‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాక‌రకాయ‌లో ఉండే ఫైబ‌ర్‌ జీర్ణ స‌మ‌స్య‌లను దరి చేరనివ్వదు. కాకరకాయ తింటే మల‌బ‌ద్ధకం స‌మస్య‌ తగ్గుతుంది. కాక‌రకాయ జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు పడిపోతాయి.

మధుమేహా నియంత్రణలో కాకర ;

కాకరకాయలు ఎక్కువశాతం నీటి పదార్థం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు కాకరకాయ ను క్రమం తప్పకుండా వాడటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలో ఉండే చక్కెర ను శక్తి గా మార్చడానికి తోడ్పడతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు ఒంట్లో ఉన్న చక్కెరను తగ్గించుకోవడానికి కాకరకాయలు వాడుతారు.

కాకరకాయలు ఆహారంలో తీసుకునేటప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలు ప్రేరణకు గురి కాబడి తగినంత ఇన్సులిన్ను అందిస్తాయి. ఈ విధంగా శరీరంలో షుగర్ పెరగకుండా కాకరకాయ సపోర్ట్ చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. మెక్సికో లో 40 మందిని షుగర్ వ్యాధి గ్రస్తులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు గ్రాముల కాకరకాయ పొడి వారికి అందజేశారు. ఇలా చేయడం వల్ల వీరి శరీరంలో డయాబెటిస్ త్వరగా కంట్రోల్ లోకి రావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.

కాకరకాయ ను నేరుగా తినడానికి ఇష్టపడనివారు పొడి రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మరియు ఫైటోకెమికల్స్ వల్ల క్యాన్సర్ గడ్డల మీద ప్రభావం చూపుతుందని తైవాన్ యూనివర్సిటీలో పరిశోధన చేయడం జరిగింది. క్యాన్సర్ కణాలు నాశనం చేయడానికి కాకరకాయ లో ఉండే ఫైటోకెమికల్స్ పనిచేస్తాయని తైవాన్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాకరకాయ రసం సహజ సిద్దంగా మంటను తగ్గించే గుణాలను కలిగి ఉండడంతో పాటు శరీరంలో చెడు క్రొవ్వుల స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని సైతం గణనీయంగా తగ్గేలా చేస్తుంది.