Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో గుండె జబ్బులు దరిచేరవా?

దానిమ్మ నుండి గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే తాజాగా పిండిన దానిమ్మ రసం మాత్రమే తీసుకోవటం మంచిది. చక్కెర కలిపి ప్యాక్ చేయబడిన దానిమ్మ రసాలను జ్యూస్ షాపుల్లో తాగటం వల్ల దాని ప్రయోజనాలు ఏమాత్రం శరీరానికి అందవు.

Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో గుండె జబ్బులు దరిచేరవా?

Pomegranate

Pomegranate Juice : గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న యువకుల సంఖ్య పెరుగుతుండడంతో, గతంలో కంటే ఇప్పుడు మన గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఆసన్నమైంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గాలు చాలానే ఉన్నాయి. అయితే సహజంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి దానిమ్మ రసం సురక్షితమైనదిగా నిపుణులు సూచిస్తున్నారు.

దానిమ్మ శక్తివంతమైన టానిన్లు, ఆంథోసైనిన్లు అనబడే యాంటీఆక్సిడెంట్లకు మూలం, వీటిని శక్తివంతమైన యాంటీ-అథెరోజెనిక్ ఏజెంట్లుగా కూడా పరిగణిస్తారు. అనేక రకాల ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయకారిగా పనిచేస్తుంది. నిజానికి, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL,చెడు కొలెస్ట్రాల్) ,అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL,మంచి కొలెస్ట్రాల్) ఆక్సీకరణం నుండి రక్షించడంలో ఇతర యాంటీఆక్సిడెంట్లతో పోల్చితే దానిమ్మ మెరుగైనదిగా చెప్పవచ్చు.

దానిమ్మ రసంలో గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. దానిమ్మ రసం ముఖ్యంగా పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడతుంది. ముదురు ఎరుపు రంగుతో, దానిమ్మ రసం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా ఇతర పండ్ల రసాల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అరకప్పు దానిమ్మపండులో 80 కేలరీలు, 16 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు మూడు గ్రాముల ఫైబర్ ఉంటాయి. దానిమ్మపండులో ఫోలేట్, పొటాషియం , విటమిన్ కె లు లభిస్తాయి.

దానిమ్మ నుండి గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే తాజాగా పిండిన దానిమ్మ రసం మాత్రమే తీసుకోవటం మంచిది. చక్కెర కలిపి ప్యాక్ చేయబడిన దానిమ్మ రసాలను జ్యూస్ షాపుల్లో తాగటం వల్ల దాని ప్రయోజనాలు ఏమాత్రం శరీరానికి అందవు. దానిమ్మ రసాన్ని ఫ్రిజ్‌లో రెండు రోజులకు మించి నిల్వ ఉంచరాదు.. దాని నుండి గరిష్ట పోషకాలను పొందడానికి పిండిన వెంటనే త్రాగడం మంచిది. బీట్‌రూట్ మరియు నారింజ రసంతో దానిమ్మ రసాన్ని కలపుకుని తాగటం ద్వారా ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు మందులను తీసుకుంటుంటే, మీ ఆహారంలో దానిమ్మ రసాన్ని చేర్చుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.