Walking : వాకింగ్ తో హై బీపీ తగ్గుతుందా?

నడకతో స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నడకతో శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి.

Walking : వాకింగ్ తో హై బీపీ తగ్గుతుందా?

High Bp

Walking : నడక మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడక రక్తపోటును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నడకతో ఎన్నో రోగాలు మటుమాయం అవుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాలైనా ప్రతి ఒక్కరూ నడవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు. నడక హై బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మజిల్స్‌కి తగినంత ఆక్సిజన్ అందుతుంది. ఫలితంగా బ్లడ్ వెస్సెల్స్ రిలాక్స్డ్‌ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది. నడవడం వల్ల శరీరంలోని కణజాలాలు బలోపేతం అవుతాయి.

నడక అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నడవడం వల్ల శరీరం ఉత్తేజంగా మారడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నడక వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిద్ర సరిగా పట్టని వారికి వాకింగ్ చక్కని మందు. రెగ్యులర్‌గా నడవడం వల్ల ఎక్కువ సేపు నిద్రపోగలుగుతారు, గాఢంగా నిద్రపోగలుగుతారు. నిద్ర మధ్యలో మాటిమాటికీ మెలకువ రాకుండా ఉంటుంది.

నడకతో స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. నడకతో శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. నడక తక్కువ రక్తపోటుకు దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహులు కూడా ప్రతి రోజు కనీసం ఒక గంటపాటు నడవటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. రెగ్యులర్‌గా నడవటం వల్ల గుండె సమర్ధ వంతంగా రక్తాన్ని పంపింగ్ చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.