Myths-Facts Covid-19 Vaccines : ఏ వ్యాక్సిన్ సురక్షితం.. మొద‌టి డోస్ ఒకటి.. రెండో డోస్‌ మరో టీకా వేయించుకోవచ్చా? ఏమౌతుంది?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే.. అయితే చాలామందిలో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయపడిపోతున్న పరిస్థితి. మాస్కులు ధ‌రిస్తూ సామాజిక దూరం తప్పక పాటించాల్సిన అవసరం ఉంది.

Myths-Facts Covid-19 Vaccines : ఏ వ్యాక్సిన్ సురక్షితం.. మొద‌టి డోస్ ఒకటి.. రెండో డోస్‌ మరో టీకా వేయించుకోవచ్చా? ఏమౌతుంది?

Can we take Two different Vaccines Doses for One Person

Myths-Facts Covid-19 Vaccines : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే.. అయితే చాలామందిలో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయపడిపోతున్న పరిస్థితి. మాస్కులు ధ‌రిస్తూ సామాజిక దూరం తప్పక పాటించాల్సిన అవసరం ఉంది.

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే వ్యాక్సిన్ కూడా వేయించుకోవడం తప్పనిసరి.. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమతినిచ్చాయి. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాల వ్యక్తమవుతున్నాయి.

వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమౌతుందోనన్న భయమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా మొదటి డోసు సరిపోదా? రెండో డోసు కూడా తీసుకోవాలా? మార్కెట్‌లో వ్యాక్సిన్ల‌లో ఏది సురక్షితం? అనేద గందరగోళం నెలకొంది. అంతేకాదు.. వ్యాక్సిన్ మొదటి డోసు ఒకటి.. రెండో డోసులో మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాలో ఏది సురక్షితం.. :
ఇండియాలో రెండు వ్యాక్సిన్ల‌ు అందుబాటులో ఉన్నాయి. న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునే అవ‌కాశం లేదు. వ్యాక్సిన్ సెంటర్లలో ఏది అందుబాటులో ఉంటే అదే వేస్తున్నారు. రెండూ సురక్షితమే.. రెండూ క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని తేలింది. ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు.

క‌రోనా నుంచి కోలుకుంటే వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా? :
క‌రోనా బారిన ప‌డిన వారు కోలుకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలి. యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి. మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది. అందుకే వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం.

రెండు డోసుల వరకు ప్ర‌త్యేక‌మైన డైట్ ఫాలో అవ్వాలా? :
క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసుల వ్యవధిలో ఎలాంటి ప్ర‌త్యేక‌మైన‌ డైట్ ఫాలో అక్కర్లేదు. సాధారణంగా ఎప్పుడూ తీసుకునే ఆహార‌మే తీసుకోవాలి. ఆల్క‌హాల్‌ తాగరాదు.

28 రోజుల్లో రెండో డోస్ కుదరకపోతే ఎలా?
మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత ఒక్కోసారి 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం సాధ్యం పడకపోవచ్చు. ఇబ్బందేమీ ఉండదు. 6 నుంచి 8 వారాల్లోపు క‌చ్చితంగా రెండో డోస్ తీసుకోవాలి. అప్పుడే వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది.

మొద‌టి డోస్ ఒకటి.. రెండో డోస్‌లో మరొకటి వేసుకోవ‌చ్చా? :
కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది. రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలి.

మొద‌టి డోస్ త‌ర్వాత క‌రోనా వస్తే ఏం చేయాలి? :
క‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు. మొద‌టి డోస్ తీసుకోవడానికి ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ తీసుకోవాలి.

వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి? :
ఏ టీకా తీసుకున్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కొంత‌మందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు రావ‌చ్చు. ఇవ‌న్నీ రెండు నుంచి మూడు రోజుల్లో త‌గ్గిపోతాయి. ఇందులో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

థైరాయిడ్ బాధితులు టీకా తీసుకోవ‌చ్చా? :
థైరాయిడ్ బాధితులు నిర‌భ్యంత‌రంగా టీకా తీసుకోవ‌చ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

వ్యాక్సినేష‌న్ ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోవాలా? :
క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు భార‌త్‌లోనే కాదు.. ప్ర‌పంచంలో ఎక్క‌డా కొవిడ్‌-19 టెస్ట్ చేయ‌డం లేదు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.

రెండు డోసులు తీసుకుంటే మాస్క్ వాడ‌క్క‌ర్లేదా? :
రెండు డోసుల వ్యాక్సినేష‌న్ త‌ర్వాత అంద‌రూ క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సిందే. టీకా తీసుకున్న వారికి కూడా క‌రోనా సోకే ప్రమాదం ఉంది. దాని తీవ్ర‌త అంత ఎక్కువ‌గా ఉండ‌దు. వీరి ద్వారా ఇత‌రుల‌కు వైర‌స్ సంక్ర‌మించే అవకాశం మాత్రం ఎప్ప‌టిలాగే ఉంటుంది. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించాలి.

గ‌ర్భిణులు, బాలింత‌లు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? :
ఇండియాలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో గ‌ర్భిణులు, పిల్ల‌ల‌పై చేయ‌లేదు. గ‌ర్భిణులు, బాలింత‌లు, పిల్ల‌లు వ్యాక్సిన్లు తీసుకోవ‌డంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫార‌సు చేయ‌లేదు.

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు మందులు ఆపేయాలా? :
క‌రోనా వ్యాక్సిన్‌పై ఇత‌ర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించ‌వు. బీపీ, షుగ‌ర్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు మందులు వాడే వారు ఎప్పటిలానే వాటిని కొనసాగించవచ్చు.