Eat Cashews : జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? రోజులో ఎంతమోతాదులో తీసుకోవాలంటే?

జీడిపప్పులోని మెగ్నిషియం గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా చేస్తుంది. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం వల్ల మన రక్తంలో కొవ్వు స్థాయిలను అదుపు చేస్తుంది.

Eat Cashews : జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? రోజులో ఎంతమోతాదులో తీసుకోవాలంటే?

Eat Cashews : భార‌తీయులు జీడిప‌ప్పును ఇష్టమైన ఆహారంగా తీసుకుంటారు. ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా కూడా జీడిప‌ప్పు ఎంతో మేలు చేస్తుంది. వినియోగంజీడిపప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మనం తినే ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వివిధ వంటల్లో జీడిపప్పును వాడుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మేలు కలిగిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేందుకు దోహదం చేస్తాయి. జీడిపప్పులో అధిక సాంద్రత కలిగించే లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు రక్షణ కలిగిస్తాయి. జీడిపప్పులో ఒమేగా 3 అల్ఫా లినోలెనిక్ ఆమ్లం ఉండటం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు ఉండటంతో జీవక్రియ మెరుగుపడుతుంది.

జీడిపప్పులోని మెగ్నిషియం గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా చేస్తుంది. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం వల్ల మన రక్తంలో కొవ్వు స్థాయిలను అదుపు చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. జీడిపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. జీడిపప్పును సరైన మోతాదులో తింటే బరువు పెరిగే అవకాశం ఉండదు.

జీడిపప్పు అతిగా తీసుకుంటే ;

జీడిప‌ప్పును అతిగా తింటే మాత్రం అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోష‌క విలువ‌లు దాగి ఉన్న జీడిప‌ప్పులో ఫ్యాట్స్ కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. అధిక బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మోతాదు మించి తీసుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌టం లేదా కిడ్ని డ్యామేజ్ వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. జీడిపప్పులోని కొవ్వు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మంద‌గించేలా చేస్తుంది. గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే జీడిపప్పును రోజుకు గుప్పెడు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.