Coconut : కొబ్బరి తింటే బరువు తగ్గుతారా!..

వందగ్రాముల కొబ్బరిలో 350 వరకు కెలోరీలు ఉంటాయి. వీటిలో అధికభాగం అందులో ఉండే 30 గ్రాముల కొవ్వుపదార్థాల నుండే వస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి.

Coconut : కొబ్బరి తింటే బరువు తగ్గుతారా!..

Coconut

Coconut : పచ్చికొబ్బరి తినటం వల్ల బరువు తగ్గటమే కాదు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయట. పచ్చికొబ్బరిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. త్వరగా అలసటకు గురయ్యేవారు తక్షణ శక్తికోసం కొబ్బరి తినటం మంచిది.

వందగ్రాముల కొబ్బరిలో 350 వరకు కెలోరీలు ఉంటాయి. వీటిలో అధికభాగం అందులో ఉండే 30 గ్రాముల కొవ్వుపదార్థాల నుండే వస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కొబ్బరిలో ఉండే కొవ్వుపదార్థాల్లో దాదాపు తొంభైశాతం సాచ్యురేటెడ్‌ కొవ్వులే. సాధారణంగా సాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి హానికరం. కానీ కొబ్బరిలో ఉండే సాచ్యురేటెడ్‌ కొవ్వులో మీడియం చెయిన్‌ ట్రైగ్లిసరైడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని పరిశోధనల ద్వారా తేలింది. ఇవి నేరుగా రక్తంలోకి చేరటం వల్ల శక్తిగా మారాతాయి.

ఆకలిని నియంత్రించేందుకు, శరీరంలోని అధిక కొవ్వును కరిగించేందుకు కూడా సహాయపడతాయి. బరువు తగ్గేందుకు కూడా పరిమిత మోతాదుల్లో కొబ్బరి తినవచ్చు. రోజూ కొద్దిగా కొబ్బరి తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ర్టాల్‌ కొంత తగ్గడమేకాక మంచి కొలెస్ర్టాల్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి.

అయితే మితి మీరి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం, తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒంట్లో చక్కెర స్థాయిలను ఇవి ఏ మాత్రం పెంచవని తాజా అధ్యయనంలో వెల్లడైంది.థైరాయిడ్ సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి ముక్కలు, కొబ్బరితో చేసిన కుకీస్ వంటివి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.