Lose Weight Easily : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తక్కువ సమయంలో బరువు సులభంగా తగ్గొచ్చా?

ఉదయం అల్పాహారంగా బాదం తీసుకోవటం వల్ల ఎర్ర రక్తకణాలలో విటమిన్ ఇ స్థాయి పెరుగుతుందని నిరూపితమైంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. బాదం పప్పులో అధిక స్థాయిలో ప్రోటీన్స్, ఫైబర్స్ ఉండడంతో పాటు తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

Lose Weight Easily : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తక్కువ సమయంలో బరువు సులభంగా తగ్గొచ్చా?

Lose Weight Easily : అధిక బరువు సమస్య ఇటీవలి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. బరువును తగ్గించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండటం లేదు. శరీర బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల చిట్కాలను ఉపయోగిస్తున్నారు. కొంతమంది నిపుణుల సూచనలతో డైట్ కంట్రోల్ తోపాటు, వ్యాయామాలు చేస్తుంటే ఇంకొందరు ఔషధాలతో బరువు కోల్పోయేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే బరువుని తగ్గించుకోవడానికి డ్రైఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల శరీరానికి అనేక పోషకాలు అందటంతోపాటుగా, ఆరోగ్యానికి మంచి మేలు కలుగుతుంది. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవటం వల్ల తక్కువ కాలంలోనే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవటం వల్ల బరువు ఈజీగా తగ్గొచ్చు. ఉదయం అల్పాహారంలో రుచికరమైన పదార్ధాలు తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఉదయాన్ని అయిల్ తో తయారు చేసిన దోశలు, బొండాలు, పూరీలు వంటి వాటి వల్ల బరువు పెరిగే ఛాన్స్ అధికంగా ఉంటుంది. వాటికి బదులుగా అల్పాహారంగా డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి చేసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే ;

వాల్ నట్స్ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు వీటి ద్వారా లభిస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు కీలకపాత్ర వహిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండంతో ఊబకాయం, గుండె సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు. మధుమేహం గుండె సమస్యలతో బాధ పడుతుంటే తప్పనిసరిగా అల్పాహారంలో వీటిని తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

పిస్తా పప్పులో శరీరంలో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది ఉంటుంది. అయితే ఉదయం పూట వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మంచి శక్తినిస్తుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. చాలామందిలో ఇది ఆకలిని కూడా నియంత్రించిందని నివేదికలు తెలిపాయి. అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది.

ఖర్జురాల్లో శరీరం కావాల్సిన అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీర బరువును కూడా నియంత్రిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో వీటిని చేర్చుకోవాలి. ఖర్జురాల్లో శరీరానికి అవసరమైన బి5 విటమిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువును సులభంగా నియంత్రిస్తుంది. ఖర్జూరం లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మినిరల్స్, న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియాను దూరం చేస్తుంది.

ఉదయం అల్పాహారంగా బాదం తీసుకోవటం వల్ల ఎర్ర రక్తకణాలలో విటమిన్ ఇ స్థాయి పెరుగుతుందని నిరూపితమైంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. బాదం పప్పులో అధిక స్థాయిలో ప్రోటీన్స్, ఫైబర్స్ ఉండడంతో పాటు తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు, అధిక బరువు సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. రెగ్యులర్ డైట్ లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. డైలీ డైట్ లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల కార్డియో వాస్క్కులర్ ఆరోగ్యానికి అనుకూలంగా సహాయపడుతాయి. ఎందుకంటే చాలా వరకూ వీటిలో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అయితే వీటిని నిర్ణీత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.