Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!

క్యాప్సికమ్‌లో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఫైబర్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించేందుకు ఉపయోగడతాయి.

Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!

Capsicum

Capsicum : క్యాప్సికమ్ వివిధ రంగులలో పండుతుంది. వీటిలో విభిన్న పోషక విలువలు ఉన్నాయి. క్యాప్సికమ్‌ల రంగుల విషయానికి వస్తే రెడ్ క్యాప్సికమ్, పసుపు క్యాప్సికం, ఆకుపచ్చ క్యాప్సికమ్, ఆరెంజ్ క్యాప్సికమ్, ఊదా,నలుపు క్యాప్సికమ్ ఉన్నాయి. విభిన్న రంగులు విభిన్నమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల ప్రొఫైల్‌కు విభిన్న వర్ణద్రవ్యాలు కారణమేనని నిపుణులు చెబుతున్నారు. రెడ్ క్యాప్సికమ్‌లు, ఇతర క్యాప్సికమ్‌ల కంటే ఎక్కువ ఫైటోన్యూట్రియెంట్‌లను కలిగి ఉంటాయి, ఇవి అత్యధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ని కలిగి ఉంటాయి. ఇది ఆకుపచ్చ రకాల కంటే 11 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ మరియు ఒకటిన్నర రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది.

ఆకుపచ్చ క్యాప్సికమ్ ఎరుపు, పసుపు లేదా నారింజ రకాల కంటే తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. కొన్నిసార్లు ఆకుపచ్చ క్యాపిస్కమ్‌లతో జీర్ణ సమస్యలను తెచ్చిపెడతాయి. ఎందుకంటే ఈ రకంలో ఎక్కువ షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి, ఇవి చిన్న ప్రేగులలో సరిగా గ్రహించబడవు. ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లో కన్నా ఎరుపు క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లోని ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్ శరీరంలో ఎలర్జీని తగ్గిస్తాయి. ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యాప్సికమ్‌లో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఫైబర్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించేందుకు ఉపయోగడతాయి. ఆకుపచ్చ క్యాప్సికమ్‌లో కొవ్వును తగ్గించే ఫైబర్ ఉంటుంది. వీటిలోని విటమిన్ బి6, ఫోలిక్ ఆమ్లాలు గుండె సంబంధ వ్యాధులకు కారణమయ్యే హోమోసిస్టిన్ అమినో ఆమ్లం ఉత్పత్తిని నియంత్రిస్తుంది. క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అత్యవసరం. క్యాప్సికమ్‌లోని ల్యూటిన్ అనే కెరోటెనాయిడ్ కంటిచూపు మందగించకుండా చూస్తుంది.

క్యాప్సికమ్‌లో నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్ మరియు పాంతోతేనిక్ యాసిడ్‌లు కూడా ఉన్నాయి. క్యాప్సికమ్‌లో సీ విటమిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్త నాళాలు, చర్మం, ఎముకల దృఢత్వానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది. క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ,సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా, తక్కువ కారంతో రుచిగా ఉంటాయి.

క్యాప్సికమ్ జుట్టును బలంగా చేస్తుంది. తలకు రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు పెరగడంలో సాయపడుతుంది. క్యాప్సికమ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణను నిరోధించడం ద్వారా కణాలను మరింత దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. క్యాప్సికమ్‌లో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్‌లు ఉన్నాయి, ఇవి మన కణాలను రక్షించతోపాటుగా , రోగనిరోధక శక్తిని పెంచుతాయి.